Diwali 2019: దీపావళికి నగలు కొనేవారికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఆఫర్స్ ఇవే

Dhanteras and Diwali 2019 offers | ధన్‌తేరస్, దీపావళి పండుగ సందర్భంగా బంగారు ఆభరణాలు కొంటున్నారా? మీ కోసం బ్యాంకు ఆఫర్స్ ప్రకటించాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నవారు ఈ ఆఫర్స్ పొందొచ్చు.

news18-telugu
Updated: October 25, 2019, 6:53 PM IST
Diwali 2019: దీపావళికి నగలు కొనేవారికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఆఫర్స్ ఇవే
Diwali 2019: దీపావళికి నగలు కొనేవారికి ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఆఫర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దేశమంతా దీపావళి సందడి కనిపిస్తోంది. దీపావళికి ముందే ధన్‌తేరస్ జరుపుకొంటూ లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ధన్‌తేరస్ రోజున బంగారం కొంటే మంచిదన్న నమ్మకం, సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉన్నదే. ధన్‌తేరస్ నుంచి దీపావళి వరకు ఈ ఫెస్టివల్ సీజన్‌లో నగలు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు చాలామంది. మరి మీరు కూడా ధన్‌తేరస్, దీపావళి పండుగ సందర్భంగా బంగారు ఆభరణాలు కొంటున్నారా? మీ కోసం బ్యాంకు ఆఫర్స్ ప్రకటించాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నవారు ఈ ఆఫర్స్ పొందొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు అందిస్తున్న ఆఫర్స్ గురించి తెలుసుకోండి.

SBI Card Offers: మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులతో నగల దుకాణాల్లో షాపింగ్ చేస్తే మంచి డిస్కౌంట్ పొందొచ్చు. Senco, ORRA, KIAH బ్రాండ్లతో ఒప్పందం చేసుకొని ఈ ఆఫర్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. బంగారు నగలు కొంటే ప్రతీ గ్రాముపై రూ.100 తగ్గింపు పొందొచ్చు. డైమండ్ నగలపైన 20 శాతం వరకు తగ్గింపు ఆఫర్స్ ఉన్నాయి. ఇక ప్లాటినమ్ నగల మేకింగ్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు, రత్నాలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ORRA షాపులో రూ.1.5 లక్షల కన్నా ఎక్కువ విలువైన వజ్రాలు పొదిగిన గోల్డ్, ప్లాటినమ్ నగలు కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. KIAH జ్యువెలరీలో వజ్రాల నగలపై 25 శాతం తగ్గింపు లభిస్తుంది.

HDFC Bank Offers: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్, 5 రెట్ల రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డుతో రూ.20,000 కన్నా ఎక్కువ నగలు కొనేవారికి రూ.1000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 26 వరకు మాత్రమే. ఏదైనా ఒక షాపులో ఆఫర్ ఒకసారే ఉపయోగించుకోవాలి. ఇక కనీసం రూ.20,000 నగలు కొనేవారికి ఐదు రెట్ల రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. గరిష్టంగా 5000 రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. ఇక తనిష్క్‌లో అక్టోబర్ 29 వరకు రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రిలయెన్స్ జ్యువెల్స్‌లో రూ.2500 వరకు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. డిసెంబర్ 31 వరకు ఆఫర్ వర్తిస్తుంది.

ICICI Bank Offers: కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.5000 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.30000 షాపింగ్ చేయాలి. ఆఫర్ అక్టోబర్ 27 వరకు ఉంది. TBZ షాపులో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.5000 వరకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కనీసం రూ.50000 నగలు కొనాలి. ఆఫర్ అక్టోబర్ 29 వరకు మాత్రమే. క్యాష్‌బ్యాక్ 2020 జనవరి 30 లోగా క్రెడిట్ అవుతుంది.



అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:
Loading...
Dhanteras 2019: ధంతేరాస్‌కు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

Gold Bond: మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే బంగారం... కొనండి ఇలా

Diwali 2019: వాట్సప్‌లో దీపావళి స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేయండి
First published: October 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...