మేమూ గిన్నెలు తోముతాం... కేటీఆర్‌కు ట్విట్టర్లో భారీ సపోర్ట్!

‘ఐ యామ్ ఎ డిష్‌వాషర్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్న కేటీఆర్ అభిమానులు... గిన్నెలు తోముకోవడం సిగ్గు పడాల్సిన పని కాదంటూ పోటోలతో పోస్టులు... ఉత్తమ్ కుమార్ స్త్రీలను అగౌరవపరిచేలా మాట్లాడారంటూ విమర్శలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 9, 2018, 4:55 PM IST
మేమూ గిన్నెలు తోముతాం... కేటీఆర్‌కు ట్విట్టర్లో భారీ సపోర్ట్!
ఉత్తమ్, కేటీఆర్
  • Share this:
తెలంగాణ ముందస్తు ఎన్నికల నగారా మోగడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ‘‘మేం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, కేటీఆర్ అమెరికాలో అంట్లు తోముకునేవాడు...’ అంటూ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కేటీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. దానికి సమాధానంగా కేటీఆర్ చాలా సున్నితంగా సమాధానమిచ్చారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు నిజంగానే గిన్నెలు కడిగానని, అక్కడున్న వారంతా ఎవరి పని వాళ్లు చేసుకుంటారని సమాధానం ఇచ్చారు. తాను చేసిన పనికి గర్వపడుతున్నా...అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్.

కేటీఆర్‌పై ఉత్తమ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గిన్నెలు తోముకోవడంలో సిగ్గు పడాల్సిన విషయం ఏముందంటూ తాము గిన్నెలు తోముతున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు చాలామంది. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న తెలుగువాళ్లు చాలామంది అంట్లు తోముతున్న దృశ్యాలను పోస్ట్ చేసి, ‘ఐ యామ్ ఎ డిష్ వాషర్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ జోడిస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో సాగుతోంది. ‘గిన్నెలు తోముకునేవాడు...’ అనే వ్యాఖ్యలు ఉత్తమ్‌కుమార్‌లోని పురుషాహంకారాన్ని చూపిస్తున్నాయని, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలా స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం దారుణమంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ‘మేమూ రోజు గిన్నెలు తోముతాం... మేం తిన్న పాత్రలను మేమే శుభ్రం చేసుకుంటాం...’ అంటూ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకునే కుర్రాళ్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇంట్లో ఉన్నప్పుడు గిన్నెలు కడుగుతారంటూ ఫోటోలతో సహా పోస్టు చేశారు కొందరు...

Loading...


ప్రవాసాంధ్రుల నుంచి ‘ఐ యామ్ ఎ డిష్‌వాషర్’ హ్యాష్‌ట్యాగ్‌కు భారీ స్పందన వస్తోంది. ఉన్నత చదువులు చదివి, మంచి పొజిషన్లో ఉన్న వారు కూడా గిన్నెలు తోమడానికి సిగ్గుపడదేముందంటూ ట్వీట్లు చేస్తున్నారు...వెంటనే ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్‌కు మద్దతుగా వస్తున్న పోస్టులకు, ‘ఐ యామ్ ఎ డిష్‌వాషర్’ పేరుతో ట్రెండ్ అవుతున్న ట్వీట్లకు కేటీఆర్, కవిత లైక్స్ కొడుతుండడం విశేషం.ఇదీ చదవండి...

కేటీఆర్, ఉత్తమ్ మధ్య 'డిష్ వాష్' డిష్యుం..!

ఢిల్లీ కాంగ్రెస్ నేతలు - కేటీఆర్ ట్వీట్ ఫైట్
First published: September 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...