HOME »NEWS »TRENDING »discovery of a strange crack expanding on moons surface has baffled scientists sk gh

Cracks on Moon: చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు.. భూమిపై విధ్వంసం తప్పదా..?

Cracks on Moon: చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు.. భూమిపై విధ్వంసం తప్పదా..?
ప్రతీకాత్మక చిత్రం

చంద్రుడిపై పగుళ్ల తీవ్రత భూమిపై భవనాలను నేలకూల్చడంతోపాటు మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగించగలదు.

  • Share this:
చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. ఆకాశంలో సూర్యుని తరువాత ప్రకాశవంతంగా కనిపించేది చంద్రుడే. చూడగానే గుర్తించే సులభమైన ఖగోళ వస్తువుగా చందమామకు పేరుంది. జాబిల్లి ప్రభావం మన గ్రహంపై ఎంతగానో ఉంటుంది. ఇది భూమి చలనాన్ని ప్రభావితం చేస్తుంది. మన వాతావరణాన్ని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఇంతలా భూ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న జాబిల్లిపై పగుళ్లు ఏర్పడినట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఆ పగుళ్లు విస్తరిస్తూనే ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు ఏర్పడతాయి. రోజులు, నెలలను గుర్తించడానికి కూడా జాబిల్లి సాయం చేస్తుంది. ఆకాశంలో దాని ఉనికి ద్వారానే క్యాలెండర్ను రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, తెగలు రూపొందించుకున్న అన్ని రకాల క్యాలెండర్లకు చంద్రుడే మూలం. మానవులు అడుగు పెట్టిన ఏకైక ఖగోళ వస్తువు చంద్రుడు. ఎన్నో సంవత్సరాలుగా దీని ఉనికి గురించి ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన రాళ్లు, మట్టిని విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. జాబిల్లి వయసు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలని పరిశోధనలు తేల్చాయి. ఇది దాదాపు భూమికి సమానమైన వయస్సు. చంద్రుని ఉపరితలం చాలా వరకు రాళ్లు, గుట్టలతో నిండి ఉంటుంది. గ్రహాలు, ఉల్కల నుంచి వెలువడే అంతరిక్ష వ్యర్థాలు చంద్రుడిపై పేరుకుపోయినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చందమామ ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఎక్సోస్పియర్ అంటారు. నీరు లేకపోవడం వల్ల చంద్రుడిపై జీవజాతుల మనుగడ సాధ్యంకాదు.



* పగుళ్లు నిజమేనా?
చంద్రుడిని, అక్కడి వాతావరణాన్ని అన్వేషించడానికి సుమారు 100కు పైగా రోబోటిక్ అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. వీటిలో తొమ్మిది మిషన్లు మనుషులను తీసుకెళ్లాయి. ఇప్పటివరకు ఆరు దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రుడి ఉనికి, దానితో మన గ్రహానికి ఉన్న సంబంధాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలను నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇటీవల చంద్రుడి ఉపరితలంపై ఏర్పడ్డ వింత పగుళ్లను కనుగొన్న పరిశోధకులు అవాక్కయ్యారు. ఈ పగుళ్లు ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయని వారు చెబుతున్నారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ అంశంపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తోంది. అపోలో17 స్పేస్ క్రాఫ్ట్ సెన్సార్ల ద్వారా జాబిల్లి ఉపరితలంపై లోపాన్ని ఈ సంస్థ అధ్యయనం చేస్తోంది. పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేసిన తరువాతే ఇందుకు కారణాలు తెలిసే అవకాశం ఉంది.

* కారణాలేంటి?
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. చంద్రుడిపై ఏర్పడ్డ శక్తిమంతమైన భూకంపం కారణంగా వింత పగుళ్లు ఏర్పడ్డాయని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. ఆ షాక్ తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5 కి దగ్గరగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు.

* భూమిపై ప్రభావమేంటి?
చంద్రుడిపై పగుళ్ల తీవ్రత భూమిపై భవనాలను నేలకూల్చడంతోపాటు మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగించగలదు. శాటిలైట్ ప్రయోగాలకు చంద్రుడిని కేంద్రంగా చేసుకోవాలని భావిస్తున్న శాస్ర్తవేత్తలు చంద్రుడి ఉపరితలాన్ని అన్వేషిస్తున్నారు. భవిష్యత్తు ప్రయోగాలకు ఇటువంటి సమాచారం శాస్త్రవేత్తలకు కీలకంగా మారనుంది. ఇది జాబిల్లి ఉపరితలంపై ఏర్పడే భూకంపాల గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:September 29, 2020, 18:12 IST

टॉप स्टोरीज