హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వాహనాలు మురికిగా ఉన్నా చలాన్ పడుద్ది.. మీకు తెలీని మరిన్ని చట్టాలు..

వాహనాలు మురికిగా ఉన్నా చలాన్ పడుద్ది.. మీకు తెలీని మరిన్ని చట్టాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారీ ఫైన్లు విధించడం మన దేశంలోనే కాదు.. అమెరికా, రష్యా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ట్రాఫిక్ జరిమనాలు భారీగానే ఉన్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ.. కొత్త వాహన చట్టం పైనే. ట్రాఫిక్ నిబంధనల గీత దాటితే భారీగా ఫైన్ విధిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేలకు వేల జరిమానా పడుతుండటంతో వాహనదారుల గుండెలు గుబేల్‌‌మంటున్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోయినా, సిగ్నల్ పడ్డాక క్రాసింగ్ లైన్ దాటినా ఠక్కున ఛలానా వచ్చేస్తోంది. అయితే, ట్రాఫిక్ క్రమబద్ధం చేయకుండానే, రోడ్లు సరిగా వేయకుండానే వేలకు వేల ఫైన్లు ఎలా విధిస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచే కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. భారీ ఫైన్లు విధించడం మన దేశంలోనే కాదు.. అమెరికా, రష్యా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లోనూ ట్రాఫిక్ జరిమనాలు భారీగానే ఉన్నాయి.

అమెరికాలో సీటు బెల్టు పెట్టుకోకపోతే 25 డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 1000 డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్ల ఛలానా విధిస్తారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. దుబాయ్‌లో వాహనానికి మురికి ఉన్నా వాహన యజమానులకు ఫైన్ వేస్తారట. తొలుత హెచ్చరించి వదిలేసి, మరో సారి దొరికితే.. 500 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. మరోసారి దొరికితే ఆ వాహనాన్ని డంపింగ్ యార్డ్‌కు పంపిస్తారంట.

First published:

Tags: Central Government, Dubai, Traffic police, Traffic rules

ఉత్తమ కథలు