సినిమాల్లో హీరో, హీరోయిన్ల మధ్య లవ్ కెమిస్ట్రీ సీన్లు, భార్యభర్తల మధ్య అన్యోన్యతను చూపించే దృశ్యాలను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీనువైట్లDirector Srinuvaitla. కాని తన రియల్ లైఫ్‌లో మాత్రం దాంపత్య జీవితం విడాకుల పేరుతో సునామీ సృష్టిస్తుందని ఊహించలేకపోయారు ఒకప్పటి క్రేజీ డైరెక్టర్. ఈ విషయం గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీFilm industryలో ఎక్కువగా వినిపిస్తున్న అంశమే అయినప్పటికి ..ఇప్పుడు మాత్రం ఆయన తన మనసులో ఉన్న భావాల్ని, బాధను సోషల్ మీడియాSocial media ద్వారా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా శ్రీనువైట్ల విడాకుల వ్యవహారం హాట్ న్యూస్‌గా మారింది. ఇలాంటి సమయంలో ఆయన భావోద్వేగంతో చేసిన ఓ ట్వీట్(Tweet) సోషల్ మీడియాలో వైరల్(Viral)గా మారింది. జీవితంలో వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్న ఈ దర్శకుడిని అమితంగా బాధిస్తున్న విషయం ఏమిటో ఒక్క ట్వీట్‌తో చెప్పలేక చెప్పారు.
మీ కోసం..
నీకోసం అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయమైన శ్రీనువైట్ల పర్సనల్ లైఫ్ ఇప్పుడు పబ్లిక్ న్యూస్ అయింది. ఎన్నో సక్సెస్ సినిమాలు డైరెక్టర్ చేసిన శ్రీనువైట్ల క్రేజీ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి దర్శకుడి నుంచి విడిపోవాలని ఉందంటూ శ్రీనువైట్ల భార్య రూప కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు.ఈ వార్తే ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు మీడియా, సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్టర్ శ్రీనువైట్ల భావోద్వేగంతో చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. జీవితం చాలా అందంగా ఉంది..మీలాంటి వాళ్లతో ఉంటే మరింత అందంగా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ ముగ్గురూ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేం అంటూ తన ముగ్గురు కూతుళ్లతో దిగిన ఫోటోని ట్యాగ్ చేశారు.
Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022
ఆమె కాదు..వాళ్లను వదిలి ఉండలేక..
భార్యతో విడాకులపై ఇప్పటి వరకు నోరు విప్పని డైరెక్టర్ ..కూతుళ్ల విషయంలో ఇంతటి సెంటిమెంట్‌తో కూడిన ట్వీట్ పోస్ట్ చేయండం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. అంతే కాదు విడాకుల వార్తపై వస్తున్న ప్రచారం నిజమే అన్నట్లుగా ఉంది శ్రీనువైట్ల ట్వీట్ చూస్తుంటే. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో తీపి గుర్తులు, చేదుఅనుభవాలు సర్వసాదారణం. అలాగే డైరెక్టర్ శ్రీనువైట్ల రియల్ లైఫ్‌లో కూడా ఎన్నో సక్సెస్ సినిమాలు చేసినప్పటికి వరుస ఫ్లాపులతో ఫేడ్ అవుట్ అయ్యారు. ఇదే క్రమంలో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన వార్త కూడా నెగిటివ్‌గా ఉండటంతో డైరెక్టర్‌లో ఈ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.
నెటిజన్ల రియాక్షన్ ..
శ్రీనువైట్ల సీరియల్ వార్తలను సీరియస్‌గా వాచ్ చేస్తున్న నెటిజన్లు మాత్రం డైరెక్టర్‌కి ధైర్యం నూరిపోస్తున్నారు. బాధపడకండి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది తప్పకుండా తిరిగి పొందుతారంటూ సక్సెస్ గురించి సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టైతే చాలు ప్రేక్షకులు మిమ్మల్ని మళ్లీ గుర్తు చేసుకుంటారని నెటిజన్లు తమ కామెంట్స్‌తో శ్రీనువైట్లకు మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Srinu Vaitla, Tollywood, Viral tweet