కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. నో కాంట్రవర్సీ అంటూనే ఆర్జీవీ కొత్త ఎత్తుగడ..

RGV | Kamma Rajyamlo Kadapa Redlu | ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు.. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను కూడా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 9, 2019, 10:49 AM IST
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. నో కాంట్రవర్సీ అంటూనే ఆర్జీవీ కొత్త ఎత్తుగడ..
రాంగోపాల్ వర్మ (File)
  • Share this:
సంచనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచనానికి తెరతీశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగు రాజకీయాన్ని నాటకీయంగా మార్చిన వర్మ.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మరో సినిమాకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను కూడా ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. ఈ సినిమాలో వివాదానికి తావే ఉండదని ట్వీట్ చేసిన వర్మ.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ఒట్టు వేశారు. అయితే, పాట చూశాక సినీ ప్రేక్షకులను కొంత అయోమయానికి గురి చేశారు. పాటను కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు వచ్చిన తర్వాత.. అంటూ మొదలుపెట్టారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో అన్న ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను..’తో ప్రారంభమయ్యే ఈ పాట శ్రోతల్లో ఆసక్తి పెంచేలా తీర్చిదిద్దారు వర్మ. అసెంబ్లీలో జరిగిన వాదనలను చూపిస్తూ కత్తులు లేవిపుడు.. చిందే నెత్తురు లేదిపుడు.. అంటూ పాటను పీక్ స్టేజీకి తీసుకెళ్లారు.

ఏపీలో యుద్ధం చేసే పద్ధతి మారిందని, ఇది కొత్త యుద్ధం అని, మాధ్యమమే ప్రధానమని, నడిచే చట్టమే ఆయుధమని పదునైన పదాలను ఈ పాటలో జోడించారు. నవ్వుతు వేసే ఎత్తుగడ, ప్రత్యర్థులకు గుండె దడ.. అని ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదనలను జోడిస్తూ పాటను రక్తి కట్టించారు. మెంటర్ ఛార్చర్ పెట్టి లాగుతారు కూపీ.. దొంగలంతా బెదిరి శరణు వేడుతారు.. తదితర పదాలు మరో రాజకీయ కోణాన్ని ఎత్తి చూపుతాయి. కాంట్రవర్సీ జోలికే పోనన్న వర్మ.. పాటలో వివాదమయ్యే రాజకీయ కోణాన్నే ఎంచుకోవడం, పైగా నిజ జీవితంలోని పాత్రలను పాటలో చూపించడం కొత్త వివాదానికి తెరతీస్తుందేమో.

ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌ను మరోసారి చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాట సాగిన తీరు.. తర్వాతి లైన్ ఏంటి? ఇంకో కొత్తదనం ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠను కలిగించారు. రక్త చరిత్ర రెండు పార్టులు, లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇలా బయోపిక్‌లను ఎంచుకున్న వర్మ.. ప్రస్తుత పరిస్థితులే ప్రధాన పాత్రలుగా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ పాటతో స్పష్టమవుతోంది.


First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading