ఆర్జీవీ లేటెస్ట్ ట్వీట్.. నెట్టింట్లో జోరుగా వైరల్..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై తనదైన శైలిలో స్పందించిన వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ(RGV) సరికొత్త ట్వీట్‌లో వార్తల్లో నిలిచారు.

news18-telugu
Updated: February 26, 2020, 4:19 PM IST
ఆర్జీవీ లేటెస్ట్ ట్వీట్.. నెట్టింట్లో జోరుగా వైరల్..
రామ్ గోపాల్ వర్మ (RGV Twitter)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై తనదైన శైలిలో స్పందించిన వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ(RGV) సరికొత్త ట్వీట్‌లో వార్తల్లో నిలిచారు. రెండ్రోజుల భారత పర్యటన పూర్తి చేసుకొని, అమెరికా చేరిన ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో సభ ముగిశాక ట్రంప్, మోదీ మధ్య సంభాషణ జరిగినట్లు.. ఆ సంభాషనల్లో ట్రంప్‌ను మోదీ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగినట్లు కామెంట్లను సృష్టించాడు ఆర్జీవీ.
ఆర్జీవీ తన ట్వీట్‌లో..
‘ట్రంప్ : మోదీ.. నన్ను ఆహ్వానించేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పావ్. మరి లక్ష మందే వచ్చారేంటి.?

మోదీ : 70 రూపాయలతో 1 డాలర్ ఎంత సమానమో.. 70 మంది అమెరికన్లతో ఒక గుజరాతీ సమానం’ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ను రాసుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతోంది. ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కేక అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆర్జీవీ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు ఆర్జీవీని కొనియాడుతున్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు