ధోని రిటైర్మైంట్ పై మహేష్, రాజమౌళి సహా పలువురి ప్రముఖుల ట్వీట్స్..

భారత దేశ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా మహేష్ బాబు, రాజమౌళి సహా పలువురు ప్రముఖులుధోని రిటైర్మైంట్ పై స్పందించారు.

news18-telugu
Updated: August 16, 2020, 2:09 PM IST
ధోని రిటైర్మైంట్ పై మహేష్, రాజమౌళి సహా పలువురి ప్రముఖుల ట్వీట్స్..
ధోని రిటైర్మెంట్ పై రాజమౌళి, మహేష్ బాబు ట్వీట్స్ (Twitter/Photo)
  • Share this:
భారత దేశ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కెప్టెన్‌గా ఉన్నపుడే.. ట్వంటీ ట్వంటీతో పాటు సాధారణ క్రికెట్‌లో రెండు ప్రపంచ కప్‌లను సాధించిన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. తన క్రికెట్‌తో ఎంతో అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు ఏకంగా ఆయన జీవితంపై దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా ‘ఎం.ఎస్.ధోని’ సినిమా తెరకెక్కిస్తే.. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ కొన్నిపేజీలు రాసుకున్న ఎం.ఎస్.ధోని ఈ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నప్రకటించారు. ధోని నిర్ణయంతో మొదటగా అభిమానులు షాకైనా.. ఆయన ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనే నిర్ణయానికి అభిమానులు వచ్చారు. కెప్టెన్‌ కూల్‌గా 7 నెంబర్ నీలం కలరు జెర్సీతో ఇక కనిపించడా అని అభిమానులు కాస్తంత భావోద్వేగానికి లోనైయ్యారు. ఇప్పటికే ధోని రిటైర్మైంట్ పై కేంద్ర మంత్రులు అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా స్పందించారు.

తాజాగా ధోని రిటైర్మెంట్ పై టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. ఇప్పటికే మహేష్ బాబు.. 2011లో ఇండియాను క్రికెట్ విశ్వవిజేతగా నిలిపిన ఐకానిక్ సిక్సర్‌‌ను నేను ఎలా మరిచిపోగలను. నేను ఆ సమయంలో వాంఖేడే స్టేడియంలో నిలుచున్నాను. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. క్రికెట్ ఎపుడు ఒకేలా ఉండదంటూ టేక్ ఎ బౌ ఎం.ఎస్.ధోని సూపర్ స్టార్ ట్వీట్ చేసారు.


మరోవైపు సీనియర్ హీరోలు వెంకటేష్, అఖిల్ సహా దర్శకుడు అనిల్ రావిపూడి, రాజమౌళి సహా పలువురు ప్రముఖులు స్పందిచారు.

ప్రపంచంలో దేనికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అలాగే క్రికెట్ సహా ప్రతి రంగంలోకి కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు బయటకు వెళ్లిపోవడం కామన్. అలాగే క్రికెట్ ప్రపంచంలో మిమ్మల్ని ఎంతోగానే అలరించిన మీరు మమ్మల్ని గర్వపడేలా చేసారన్నారు రాజమౌళి.


మీ నిర్ణయం కాస్త కష్టంగానే ఉన్న భవిష్యత్తు తరాలకు మీరు ఒక మార్గదర్శకంలా నిలిచారు అంటూ ట్వీట్ చేసారు రాజమౌళి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 16, 2020, 2:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading