హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dinosaur: ఐక్యరాజ్య సమితి సమావేశ మందిరంలోకి డైనోసార్​.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ ప్రతినిధులు

Dinosaur: ఐక్యరాజ్య సమితి సమావేశ మందిరంలోకి డైనోసార్​.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ ప్రతినిధులు

యూఎన్​ సమావేశంలో డైనోసార్​

యూఎన్​ సమావేశంలో డైనోసార్​

ఐక్యరాజ్యసమితి (UN) సమావేశ మందిరంలో అంతర్జాతీయ ప్రతినిధులతో సదస్సులో వాతావరణం, పర్యావరణ మార్పుల (On climate and Environment change )పై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది.

ఐక్యరాజ్యసమితి (UN) సమావేశ మందిరంలో అంతర్జాతీయ ప్రతినిధులతో సదస్సులో వాతావరణం, పర్యావరణ మార్పుల (On climate and Environment change )పై తాజాగా ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) గ్రాఫిక్ డైనోసార్‌ (graphic dinosaur)తో ప్రసంగం ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్యసమితి 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీ (general assembly) లో దౌత్యవేత్తలు కూర్చొని ఉండగా.. కావెర్నస్ హాల్‌లోకి dinosaur చేరుకుని ప్రసంగాన్ని మొదలుపెడుతుంది. వాతావరణ విపత్తుల నుంచి ప్రజలను రక్షించాలని.. ఆలస్యం కాకముందే మేలుకోవాలంటూ పిలుపునిచ్చింది.

రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం నుంచి ప్రజలను రక్షించాలని గ్రాఫిక్ డైనోసార్‌ కోరింది. మనం వాడే శిలాజ ఇంధనాలతో కర్బన ఉద్గారాలు గాల్లో కలిసి వాతావరణం వేడెక్కుతోంది (The atmosphere is warming with the carbon emissions of the fossil fuels we use). దీంతో పర్యావరణ ఇబ్బందులు తలెత్తడంతోపాటు.. విపత్తులు (Disasters ) అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ఉద్ఘారాలను తగ్గించి ఉష్ణోగ్రతలు పెరగకుండా ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రపంచ దేశాలకు దిశానిర్ధేశం చేసింది. దీనిలో భాగంగా పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి వినూత్న సందేశం ఇప్పించింది. అంతరించిపోయిన డైనోసార్లతో.. భూమి మీద ప్రజలు కూడా అంతరించిపోతారని హెచ్చరికలు చేసింది.

' isDesktop="true" id="1070478" youtubeid="5v4pNqCGaXU" category="international">

నిజంగా అడుగులేస్తున్నారా?..

డైనోసార్​ వచ్చిరాగానే ‘ప్రజలారా వినండి’ అంటూ ప్రసంగాన్ని (speech) మొదలు పెట్టింది. ‘‘ మీరంతా పర్యావరణ విపత్తు దిశగా అడుగులేస్తున్నారంటూ పేర్కొన్నారు. పెద్ద పెద్ద ఉల్కలపై అంతే మొత్తాన్ని మనం ఖర్చు (spend) చేస్తున్నామనుకోండి.. ఏమవుతుంది.. ఇప్పుడు మీరు చేస్తున్నది అదేనంటూ హెచ్చరించింది.

ఆకలితో అలమటిస్తున్నారు..

‘‘ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు.. లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం.. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పేదరికం (poverty)లో మగ్గుతున్నారు.. ఆకలి (hungry)తో అలమటిస్తున్నారు. ఇలా వినాశనంపై ఖర్చు చేయడానికి బదులు.. పేదలకు సాయం చేస్తే బాగుంటుందని ఎప్పుడూ అనిపించలేదా? మీ అంతం కోసం మీరే డబ్బులు (money) ఖర్చు చేసుకుంటారా?” అంటూ డైనోసార్ ప్రశ్నించింది.

మించిపోయింది లేదు..

’’ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ప్రణాళికలు, చర్యలు నిర్ధేశించుకోండి. కోవిడ్​ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మీ ఆర్థిక వ్యవస్థలను (Economy) పటిష్టం చేసుకుంటున్నారు. ఈ సమయంలో నేను మీకిచ్చే సలహా (advice) ఇదే.. మీ నాశనాన్ని మీరే కోరుకోకండి. సమయం (Time) మించిపోక ముందే మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. మార్పులను స్వాగతించండి.. మారండి. దాని నుంచి తప్పించుకునేందుకు ఏవేవో కారణాలు (Reasons) చెప్పొద్దు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..’’ అంటూ గ్రాఫిక్ డైనోసార్ (graphic dinosaur) తన ప్రసంగాన్ని ముగించింది. గ్రాఫిక్ డైనోసార్ ప్రసంగం అనంతరం ఐక్యరాజ్య సమితి సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మార్మోగింది.

First published:

Tags: United Nations, WEATHER

ఉత్తమ కథలు