HOME »NEWS »TRENDING »dinosaur fossils unearthed it could belong to the worlds largest ever creature sk gh

Dinosaur fossils: భూమిపై నివసించిన అతిపెద్ద జీవి ఇదే.. ఆ శిలాజం ఏం చెబుతోంది?

Dinosaur fossils: భూమిపై నివసించిన అతిపెద్ద జీవి ఇదే.. ఆ శిలాజం ఏం చెబుతోంది?
ప్రతీకాత్మక చిత్రం

తాజాగా కనుగొన్న శిలాజం ప్రకారం ఈ టైటానోసార్ 40 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండేదని, 110 టన్నుల వరకు బరువున్న జీవిగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు భూమిపై నివసించిన అన్ని జీవ జాతుల కంటే అతిపెద్ద జంతు జాతిగా పాటగోటిటన్స్‌ను భావిస్తున్నారు.

  • Share this:
భూమిపై జీవించిన అతిపెద్ద జీవి ఏదంటే.. అందరూ డైనోసార్ అని చెబుతారు. అందులోనూ అన్నింటికంటే పెద్ద డైనోసార్ ఆనవాళ్లు కనిపించాయి. డైనోసార్ జాతికే చెందిన టైటానోసార్లకు (Titanosaur) చెందిన అతిపెద్ద శిలాజాన్ని పాలియోంటాలజిస్టులు (Paleontologists) తాజాగా కనుగొన్నారు. ఇవి భూమిపై నివసించిన అతిపెద్ద టైటానోసార్ల శిలాజమన్నది వీరి అంచనా. అర్జెంటీనాలోని (Argentina) ఓ ప్రాంతంలోని అత్యంత బలంగా ఉన్న సెడిమెంటరీ శిలల మధ్య లభించిన భారీ శిలాజం అంతా టైటానోసార్లదేనని ఇప్పుడు వీరు నిర్ధారిస్తున్నారు. ఈ శిలాజం ప్రకారం పురాజీవ శాస్త్రజ్ఞులు ఇప్పటి వరకు ఛేదించిన మొత్తం సమచారం చాలా ఆసక్తికరంగా ఉంది. టైటానోసార్లకు భారీ తోక ఉండేదని ఈ శిలాజంలోని తోక భాగంపైన ఉన్న వెన్నెముకకు సంబంధించిన ఎముకలు చూస్తే స్పష్టమవుతోందని తెలిపారు. పెద్ద మెడ, పెద్ద తోక, నాలుగు కాళ్లతో జీవించిన అతి భారీ సారోపాడ్ డైనాసార్ జాతిలో ఒకటైన టైటానోసార్ ల రకం జీవికి సంబంధించిన పలు విషయాలను జర్నల్‌లో Cretaceous Research పొందుపరిచారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద సారోపాడ్ (Sauropod) శిలాజం తాము చూడలేదని నిపుణులు చెబుతున్నారు.




పాటగోటిటన్ (Patagotitan) జాతి జీవులకంటే ఇవి టైటానోసార్లు పెద్దవని పాలియోంటాలజిస్టులు అంచనా వేస్తున్నారు. పాటగోటిటన్ జాతి జీవులు 100 మిలియన్ల నుంచి 95 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై నివసించేదని వీటి పొడవు 122 అడుగులకంటే ఎక్కువ ఉండేదనే అంచనాలున్నాయి. తాజాగా కనుగొన్న టైటానోసార్ శిలాజం ఇంకా పెద్దగా ఉండటంతో ఇప్పుడిది సరికొత్త పరిశోధనలకు మూలవిషయంగా మారింది. ఇక ప్రపంచంలోని అన్ని ఖండాల్లో టైటానోస్రల శిలాజాలు లభించగా అంటార్కిటికాలో మాత్రం వీటి అవశేషాలు కనిపించకపోవటం ఆసక్తి కలిగిస్తోంది. వీటి బరువు 40 టన్నులకు పైగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. కానీ ఇదమిత్థంగా ఇంత బరువుండేదనే నిర్ధారణకు రాకపోయినా ఇది చాలా టన్నుల బరువుండే భారీ ఆకారంలో ఉండేదనే విషయం మాత్రం వీటి అస్థిపంజరాలను బట్టి తేల్చారు.
Image (CNN)

తాజాగా కనుగొన్న శిలాజం ప్రకారం ఈ టైటానోసార్ 40 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండేదని, 110 టన్నుల వరకు బరువున్న జీవిగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు భూమిపై నివసించిన అన్ని జీవ జాతుల కంటే అతిపెద్ద జంతు జాతిగా పాటగోటిటన్స్‌ను భావిస్తున్నారు. వీటి బరువు 77 టన్నులు ఉండచ్చని శాస్త్రజ్ఞులు భావించగా తాజాగా లభించిన ఈ శిలాజం ప్రకారం టైటానోసార్లు మరింత పెద్ద జీవిగా భూగ్రహంపై సంచరించిన జాతిగా లెక్కగడుతున్నారు. క్రెటేషియస్ కాలం చివర్లో ఈ అతిపెద్ద టైటానోసార్లు చిన్న, మీడియం సైజు టైటానోసార్లతో పాటు కలిసి సమూహంగా నివసించినట్టు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 101 మిలియన్ ఏళ్ల క్రితం టైటానాసార్ల జాతి ఇక్కడ నివసించినట్టు భావిస్తున్నారన్నమాట.


టైటానోసార్ల గురించి మనకు తెలిసిన సమాచారం చాలా తక్కువ. కొన్ని భౌగోళిక ప్రాంతాలకే పరిమితమైన ఈ టైటానోసార్ జాతి డైనోసార్ల శిలాజాలు కూడా చాలా పరిమితంగానే ఇప్పటి వరకు లభించాయి. ఇతర ఖండాల్లో కంటే దక్షిణ అమెరికాలోనే టైటానోసార్ల శిలాజాలు ఎక్కువగా లభించాయి. చెల్లాచెదురుగా, అసంపూర్తిగా ఉన్న టైటానోసార్ల శిలాజాలు మాత్రమే ఇప్పటి వరకు పాలియోంటాలజిస్టులకు లభించాయి. టైటానోసార్లవి చాలా తక్కువ అస్తిపంజరాలు లభించటంతో పాటు చెక్కు చెదరకుండా ఉన్న పుర్రెలు పెద్దగా లభించనందున ఈ జంతువు ఎలా ఉండేదన్న పునర్నిర్మాణం చాలా కష్టంగా మారుతూ వచ్చింది. ఈనేపథ్యంలో అర్జెంటీనాలో లభించిన చెక్కుచెదరని టైటానోసార్ శిలాజం ఈ దిశగా చాలా సమాచారాన్ని మనకు అందించనుంది.
Published by:Shiva Kumar Addula
First published:January 20, 2021, 12:45 IST