Dinosaur Eggs: తమిళనాడులో బయటపడ్డ డైనోసర్ గుడ్లు.. ఈ వార్త వెనుక వాస్తవాలివే

Dinosaur Eggs: వేల ఏళ్ల నాటి డైనోసర్ గుడ్లు బయటపడ్డాయన్న ప్రచారం ఇటీవల తమిళనాట జోరుగా సాగింది. ఇదిగో ఫొటోలు, వీడియోలంటూ కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.

news18-telugu
Updated: October 23, 2020, 5:49 PM IST
Dinosaur Eggs: తమిళనాడులో బయటపడ్డ డైనోసర్ గుడ్లు.. ఈ వార్త వెనుక వాస్తవాలివే
తవ్వకాల్లో బయటపడ్డ అమ్మోనైట్ అవక్షేపాలు
  • Share this:
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి తప్పుడు వార్తల సంచారం అధికంగా పెరిగిపోయింది. అక్కడ దెయ్యం తిరిగిందని, మరో చోట ఆవు కడుపులో మనిషి పుట్టాడని ఇలా చిత్ర విచిత్ర ఫొటోలు విపరీతంగా షేర్ అవుతూ ఉన్నాయి. కొందరు ఇవి నిజమని భావించి షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. వేల ఏళ్ల నాటి డైనోసర్ గుడ్లు బయటపడ్డాయన్న ప్రచారం అక్కడ జోరుగా సాగింది. ఇదిగో ఫొటోలు, వీడియోలంటూ కొందరు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. అయితే కొన్నాళ్లకు వాటిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు అసలు వాస్తవాన్ని తేల్చారు. అవి డైనోసర్ గుడ్లు కాదని తేల్చడంతో అంతా నోరెళ్లపెట్టాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని పెరంబలూర్ జిల్లా కున్నాం గ్రామంలో చెరువుల నిర్మాణం కోసం 50 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు.

ఆ క్రమంలో తవ్వకాలు జరుపుతుండగా గుడ్లను పోరిన భారీ పరిమాణంలో ఉన్న ఆకారాలు కొన్ని బయటపడ్డాయి. దీంతో అవి రాక్షసబల్లి గుడ్లు కావొచ్చొన్న భావన స్థానికుల్లో వ్యక్తమైంది. కొందరు స్థానికులు ఏకంగా అవి డైనోసర్ గుడ్లంటూ తేల్చేశారు. దీంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెరంబలూర్ జిల్లాలో రాక్షసబల్లి గుడ్లు బయటపడ్డాయన్న ప్రచారం సోషల్ మీడియా వేధికగా జోరుగా సాగింది.

అయితే స్థానికుల నుంచి సమాచారం అందకున్న పురావస్తుశాఖ అధికారులు ఆ వింత పరిమాణంలో ఉన్న ఆ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అవి ఏంటన్న అంశంపై పరీక్షలు నిర్వహించారు. చివరికి అవి డైనోసర్ గుడ్లు కాదని, అమ్మోనైట్ అవక్షేపాలు అని నిర్ధారించారు. అనంతరం జియాలజీ, పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం తవ్వకాలు జరుపుతున్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడ లభ్యమైనవి దాదాపు 416 మిలియన్ ఏళ్లనాటి అమ్మోనైట్ శిలాజాలని నిపుణులు స్పష్టం చేశారు. అవి డైనోసర్ గుడ్లు అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వారు తేల్చారు.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading