Home /News /trending /

Vakeel Saab: భార్య పక్కన ఉండగానే ఇంత అరాచకం ఏంటి దిల్ రాజు.. బాబోయ్!

Vakeel Saab: భార్య పక్కన ఉండగానే ఇంత అరాచకం ఏంటి దిల్ రాజు.. బాబోయ్!

dil raju fan moment

dil raju fan moment

Vakeel Saab: ఈరోజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉదయం 3 గంటల నుంచి వకీల్ సాబ్ రివ్యూలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

    Vakeel Saab: ఈరోజు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉదయం 3 గంటల నుంచి వకీల్ సాబ్ రివ్యూలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం అభిమానులు నిన్న ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేశారు అంటే నమ్మండి. ఎన్నో ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులంతా తెగ రచ్చ చేస్తున్నారు.

    ఇక ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పూర్తిగా అభిమానిగా మారిపోయాడు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోకు భార్యతో హాజరైన దిల్ రాజు థియేటర్ లో రచ్చ రచ్చ చేశాడు. భార్య పక్కన ఉండగానే టీనేజ్ కుర్రాడిలా మారిపోయ్ సిన్ సిన్ కు పేపర్లను విసురుతూ పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా మారిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత భార్య పక్కన ఉండగానే ఇంత అరాచకం ఏంటి దిల్ రాజు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



    కాగా బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన పింక్ రీమేక్ గా ఈ సినిమా తీసినప్పటికి తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ తన మ్యానరిజంతో సూపర్ గా నటించాడు. ఇక ఇందులో నటించిన నివేద థామస్ ఎంతో న్యాచురల్ గా నటించి తన పాత్రకు న్యాయం చేసింది. ఇక అంజలి, అనన్య నాగళ్ళ కూడా అద్భుతంగా నటించారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ లో శృతి హాసన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన థియేటర్ లో అభిమానుల ఈలలు మాత్రం భారీగా వినిపించాయ్.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Benefit shows, Dil raju, Pawan kalyan, Tollywood, Vakeel Saab, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు