DID YOU KNOW THAT THE FIRST YOUTUBE VIDEO WAS ABOUT ELEPHANTS AND POSTED 17 YEARS AGO WATCH HERE GH MKS
YouTube First Video: యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన మొట్టమొదటి వీడియో చూశారా? ఇదిగో..
యూట్యూబ్ లో పోస్ట్ అయిన ఫస్ట్ వీడియో
తొలిసారిగా అప్లోడ్ అయిన వీడియోలో ఏముందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిని అప్లోడ్ చేసింది మరెవరో కాదు.. యూట్యూబ్‌ని స్థాపించిన స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీం. తాజాగా యూట్యూబ్ ఇండియా (YouTubeIndia) అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.
ప్రముఖ వీడియో షేరింగ్ ఫ్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ రోజుల్లో ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలన్నా చాలా మంది యూట్యూబ్‌నే ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్‌లో దొరకని ఇన్ఫర్మేషన్ అంటూ ఏదీ ఉండదు. అయితే కోట్లాది వీడియోలతో ఇంతలా పాపులరైన యూట్యూబ్‌ను ఏ వీడియో (YouTube First Video)తో ప్రారంభించారో, తొలిసారిగా అప్లోడ్ అయిన వీడియోలో ఏముందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియోను అప్లోడ్ చేసింది మరెవరో కాదు.. యూట్యూబ్‌ని స్థాపించిన స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీం. తాజాగా యూట్యూబ్ ఇండియా (YouTubeIndia) అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది. "ఈ వీడియోల మహాసముద్రం ఒక షార్ట్ వీడియోతో మొదలైంది" అన్నట్లు ఈ పోస్ట్‌కి ఓ క్యాప్షన్ జోడించింది.
ప్రేమికుల రోజు సందర్భంగా 2005 ఫిబ్రవరి 14న స్టీవ్ చెన్, చాద్ హర్లీ, జావేద్ కరీం యూట్యూబ్‌ను లాంచ్ చేశారు. వీరు ముగ్గురూ కలిసి 2005 ఏప్రిల్ 23న 19 సెకన్ల నిడివితో మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. కరీం శాన్ డియాగో జూలో ఏనుగుల ఆవరణ ముందు నిల్చొని ఈ వీడియోను రికార్డ్ చేశారు. "వెల్, ఇక్కడ మేం ఏనుగుల ముందు ఉన్నాం. ఈ ఏనుగుల గురించి ఒక గొప్ప విశేషం ఏంటంటే.. వాటికి చాలా పొడవాటి తొండాలు ఉన్నాయి. ఈ దృశ్యం చూసేందుకు చాలా బాగుంది," అని కరీం వీడియోలో చెప్పారు.
కరీం వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఏకైక వీడియో ఇదే. "మీ ఎట్ ది జూ (Me At The Zoo)" అనే టైటిల్ గల ఈ ఫస్ట్ యూట్యూబ్ వీడియోకి ఇప్పటికే 23.5 కోట్ల మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మోడర్న్ డే వ్లాగింగ్కి ఒక మైలు రాయిగా కూడా నిలుస్తోంది.
CM KCR | BRS : కేసీఆర్ అనూహ్యం.. ప్రాంతీయ ఫార్ములాతోనే జాతీయ పార్టీ -ఎన్టీఆర్, పీవీ బొమ్మలతో..
2005, మేలో యూట్యూబ్ బీటా ప్రజలందరికీ విడుదలైంది. 2006 నవంబర్ నాటికి, రొనాల్డిన్హో నటించిన నైక్ యాడ్ (https://youtu.be/cTY4Yo2SR2o) ఒక మిలియన్ వ్యూస్ చేరుకున్న మొదటి యూట్యూబ్ వీడియోగా రికార్డు సృష్టించింది. ఈ వీడియో షేరింగ్ సైట్ అధికారికంగా డిసెంబర్ 15, 2005న లాంచ్ అయ్యింది. ఆ సమయానికి సైట్‌కి రోజుకు 8 మిలియన్ వ్యూస్ వచ్చేవి. ఆ సమయంలో వీడియో క్లిప్‌లను 100 మెగాబైట్ సైజ్‌కు మించి అప్లోడ్ చేయడం కుదరక పోయేది. అంటే వీడియో ఫుటేజ్ 30 సెకన్లకు మాత్రమే పరిమితమై ఉండేది.
ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఫైల్ 256 జీబీ లేదా 12 గంటలు నిడివి గల వీడియోని అప్లోడ్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. యూట్యూబ్ బీభత్సమైన పాపులారిటీని గమనించిన గూగుల్ 2006 అక్టోబర్ నెలలో యూట్యూబ్‌ని 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది. ఇప్పుడు కోట్లల్లో సంపద తెచ్చిపెడుతూ గూగుల్ కంపెనీ ఫిలిం ప్రధాన ఆదాయ వనరుగా యూట్యూబ్ అవతరించింది. అంతేకాదు మోస్ట్ సైట్స్‌లో యూట్యూబ్ గూగుల్ తర్వాత రెండో ప్లేస్ సాధించింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.