హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Athiya Shetty: అనార్కలీలో అదిరిపోయిన అతియా.. డ్రెస్ ఎంబ్రాయిడరీకి 2000 గంటల సమయం..!

Athiya Shetty: అనార్కలీలో అదిరిపోయిన అతియా.. డ్రెస్ ఎంబ్రాయిడరీకి 2000 గంటల సమయం..!

అనార్కలీలో అదిరిపోయిన అతియా.. డ్రెస్ ఎంబ్రాయిడరీకి 2000 గంటల సమయం..!

అనార్కలీలో అదిరిపోయిన అతియా.. డ్రెస్ ఎంబ్రాయిడరీకి 2000 గంటల సమయం..!

ఇటీవల పెళ్లి పీటలెక్కిన అతియా శెట్టి.. తన హల్దీ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా ఓ అనార్కలీ డ్రెస్‌ను డిజైన్ చేయించుకుంది. ఆ డ్రెస్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తి చేయడానికి ఏకంగా 2000 గంటల సమయం పట్టిందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. ఈ డ్రెస్ వెనకాల ఉన్న కథేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆకర్షణీయమైన అవుట్‌ఫిట్‌ ధరించడానికి ఆడవాళ్లు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక పెళ్లి, ఇతర వేడుకల సందర్భాల్లో కచ్చితంగా అలాంటి డిజైనే కావాలని పట్టుబడుతుంటారు. ఇదేవిధంగా, ఇటీవల పెళ్లి పీటలెక్కిన అతియా శెట్టి.. తన హల్దీ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా ఓ అనార్కలీ డ్రెస్‌ను డిజైన్ చేయించుకుంది. ఆ డ్రెస్‌పై ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తి చేయడానికి ఏకంగా 2000 గంటల సమయం పట్టిందంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. ఈ డ్రెస్ వెనకాల ఉన్న కథేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం ఈ నెల 23న మహారాష్ట్రలోని ఖండారా ఫాం హౌజ్‌లో వైభవోపేతంగా జరిగింది. వివాహం, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, హల్దీ ఫంక్షన్‌లో అతియా శెట్టి ధరించిన అనార్కలీ.. అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. కాటన్ డ్రెస్‌పై హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించడంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంది. ఈ ‘రి రీతూ కుమార్ ఎలిసియన్ అనార్కలీ’ని ప్రముఖ క్రాఫ్ట్ డిజైనింగ్ కంపెనీ ‘రీతూ కుమార్’ తీర్చి దిద్దింది. ఈ డ్రెస్‌ని ఎలా సిద్ధం చేశారో ఇన్‌స్టాగ్రాం పోస్ట్ ద్వారా కంపెనీ అధినేత ‘రీతూ కుమార్’ వెల్లడించారు.

ఓల్డ్ డిజైన్

19వ శతాబ్దపు అనార్కలీ డిజైన్‌ను ఆదర్శంగా తీసుకుని అతియా శెట్టి డ్రెస్‌ను రూపొందించారు. సాధారణంగానే రాజస్థాన్‌ శైలిలో కాటన్ దుస్తులపై ఎంబ్రాయిడరీ వర్క్ కచ్చితంగా ఉంటుంది. ఇలా అనార్కలీని రూపొందించడానికి బెంగాల్‌లోని ఫులియా కళాకారులు నేసిన 200 పలుచని కాటన్ వస్త్రాలను తెప్పించారు. కాటన్ వస్త్రాన్ని సున్నితంగా మడతలు పెట్టుకుంటూ చేతితో ఒక్కో అల్లికను పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ మ్యాంగో మోటిఫ్స్(Mango Motifs)ని వేయడానికి అల్లికల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇలా నిర్దిష్ట డిజైన్‌లో పూర్తి చేయడానికి ఏకంగా 2000 గంటలు పట్టింది.

ఈ డ్రెస్‌పై డిజైన్‌ కోసం జైపుర్‌కి చెందిన ‘గోక్రు’ గోటాని ఉపయోగించారు. రిబ్బన్లు వేయడం, మెటల్ స్ట్రిప్స్‌ను ఒకదానికొకటి క్రాస్‌గా అల్లడం చేశారు. ప్రత్యేకమైన లుక్ తీసుకురావడానికి ఈ పద్ధతిని రిపీట్ చేశారు. అతియా శెట్టి వేసుకున్న అనార్కలీని తీక్షణంగా గమనిస్తే మీకు దానిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ గురించి స్పష్టంగా అర్థమవుతుంది. అంచుకు కాస్త ఎగువన ఉన్న మ్యాంగో మోటిఫ్స్‌ తయారు చేయడానికి కాస్త ఎక్కువగా శ్రమపడాల్సి వచ్చింది. టాప్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్‌తో నిండి ఉంటుంది. అది కూడా సాదాసీదాగా కాదు. ఒక్కో చిన్న డిజైన్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే 2000 గంటల పాటు సమయం తీసుకుంది.

మెరిసిన అతియా

ఈ అనార్కలీతో అతియా శెట్టి ఫ్యాషన్ లవర్స్‌కి కొత్త టేస్ట్ చూపించింది. అంతేగాకుండా, హల్దీ వేడుకకు చాలా సింపుల్‌గా రెడీ అయింది. తక్కువ మేకప్‌ వేసుకుంది. జడను అలా వదిలేసి కొప్పున పూలు పెట్టుకుంది. ఇక పాపడ బిల్లతో అతియాకు మరింత అందం వచ్చింది. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ రీనా దత్తా, స్టైలిస్ట్ అమి పటేల్, మేకప్ స్టైలిస్ట్ సిమ్రాన్ గిద్వానీ.. అతియా శెట్టిని అందంగా ముస్తాబు చేయడంలో పాలు పంచుకున్నారు.

First published:

Tags: Actress, Bollywood