హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Travel By Train: రైలులో నుంచి ఫోన్ లేదా పర్సు పడిపోయిందా.. దిగులు వద్దు.. ఇలా చేయండి..

Travel By Train: రైలులో నుంచి ఫోన్ లేదా పర్సు పడిపోయిందా.. దిగులు వద్దు.. ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Travel By Train: తాను ఒంటరి అని ఫీల్ అవుతున్న ప్రతీ ఒక్కరికీ మొబైలే ప్రపంచం. అది ఉంటే.. ఎదుటి వ్యక్తితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అయితే ఎప్పుడైనా మీరు రైలులో ప్రయాణించినప్పుడు మొబైల్ ఫోన్ కిందపడిపోయిందా.. అటువంటి సమయంలో ఏం చేయాలో చాలామందికి తెలవదు. ఆ సందర్భంలో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...

  తాను ఒంటరి అని ఫీల్ అవుతున్న ప్రతీ ఒక్కరికీ మొబైలే (Mobile) ప్రపంచం. అది ఉంటే.. ఎదుటి వ్యక్తితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. కొంతమందికి ఫ్రెండ్స్ (Friends)  దగ్గర లేనప్పుడు ఇలా చేస్తే మంచిదే గానీ.. స్నేహితులు లేదా కుటుంబసభ్యులను ఎదురుగా పెట్టుకొని కూడా ఫోన్ లోనే ముతి పెట్టి తీయరు చాలామంది. ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మొబైల్ ను మంచికి ఉపయోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగా.. రైలు ప్రయాణాలు చేయాలంటే చాలామందికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే..ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు.. శబ్ధ కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చు. అంతే కాకుండా ఇతర ప్రయాణాలతో పొల్చుకుంటే టికెట్ ధర తక్కువగా ఉంటుంది.

  Both Men Will Married: తెలంగాణలో తొలిసారి.. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోబోతున్నారు.. వివరాల్లోకి వెళ్తే..


  ఎక్కువ దూర ప్రయాణం చేసేవారికి కూడా ఈ రైలు ప్రయాణం ఎంతో ఉపయోగకరం. ఇలా రైలులో వెళ్తుంటే.. ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. సమయం ఎక్కువ పట్టినా పర్వాలేదు.. ప్రయాణం హాయిగా ఎలాంటి తలనొప్పి లేకుండా రైలులో వెళ్లొచ్చు. అందుకే చాలామంది రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. రైలు ప్రయాణంలో కొంతమంది ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే.. కిటికీ పక్కన కూర్చొవడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. దాని ద్వారా బయట కనపడే లొకేషన్లను చూడటానికి.. వాటిని ఫోన్లలో బంధించాలని ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు. అటువంటి సమయంలో కిటికీలో నుంచి కొన్ని వస్తువులు పడిపోతుంటాయి.

  Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


  వాటితో ఉపయోగం లేకుండా ఉంటే.. అలానే వదిలేస్తాము.. కానీ ఏదైనా విలువైన పర్సు లేదా ఫోన్ లాంటిది పొరపాటున జారీ కిందపడిపోవచ్చు. బస్సు ప్రయాణం అయితే బస్సు డ్రైవర్ కు చెప్పి.. దిగి మన వస్తువులను తెచ్చుకుంటాం. కానీ అది రైలు. ఇలా వెళ్లి డ్రైవర్ కు చెప్పే అవకాశం ఉండదు. రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇక ఆ వస్తువు గురించి చాలామంది ఏం చేయాలో తెలియక మర్చిపోతుంటారు. కానీ అలా కాకుండా ఆ సమయంలో కాస్తంతా సమయస్పూర్తిగా వ్యవహరిస్తే.. మీ ఫోన్ లేదా పర్సు మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే.. రైలులో ప్రయాణించేటప్పుడు మీ వస్తువు ఏదైనా కింద పడిపోతే దగ్గరలోని రైల్వే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు.

  Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..


  కంప్లైంట్ ఇవ్వడానికి మీ వస్తువు పడిపోయిన ప్రదేశం ఏంటో మీకు తెలిస్తే చాలు. అది ఎలా చేయాలంటే.. ట్రైన్ వేగంగా వెళ్తున్న సందర్భంలో మన ఫోన్ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడం కష్టమే కానీ.. మనకు ట్రాక్ పక్కన కొన్ని స్తంభాలు కనపడుతుంటాయి. ఆ స్తంభాల మీద రెండు నంబర్లు ఉంటాయి. ఆ రెండు నెంబర్లకి మధ్య సింబల్ ఉంటుంది. సింబల్ పైన ఉన్న నంబర్ మీరు ట్రైన్ దిగే ప్రదేశం వరకు ప్రయాణించాల్సిన కిలోమీటర్లని సూచిస్తుంది. సింబల్ కింద ఉన్న నంబర్ ఆ స్తంభం నెంబర్ సూచిస్తుంది.

  Bigg Boss 5 Telugu: భారీగా పడిపోయిన షణ్ముఖ్ గ్రాఫ్.. నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన మరో కంటెస్టెంట్..


  దానిని మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైలు మీ వస్తువు పడిపోయిన ప్రదేశం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీసులకి గాని లేదా స్టేషన్ మాస్టర్ కి గాని ఫిర్యాదు చేయండి. మీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది. ఇలా చేస్తే కచ్చితంగా దొరుకుతుందని చెప్పలేము గానీ.. కచ్చితంగా దరిదాపుల్లో ఉండే గ్రూప్ డీ ఉద్యోగస్తులను పంపించి గాలిస్తారు. తొందరగా స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దొరికే ఛాన్స్ ఉంటుంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Trains, Travel

  ఉత్తమ కథలు