Home /News /trending /

DID MAHUA MOITRA HIDE HER LOUIS VUITTON BAG WORTH RS ONE AND 6 LAKH IN LOK SABHA DURING PRICE RISE DEBATE VIDEO GOES VIRAL PAH

OMG: లోక్ సభలో లక్షల కాస్లీ హ్యాండ్ బ్యాగ్ దాచేసిన మహిళా ఎంపీ.. వీడియో వైరల్..

బ్యాగ్ దాచేస్తున్న ఎంపీ

బ్యాగ్ దాచేస్తున్న ఎంపీ

Delhi: లోక్ సభలో టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ధరల పెరుగుదలపై కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో.. మరో మహిళా ఎంపీ.. మహువా మోయిత్రా చేసిన పనిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్.. కొన్నిరోజులుగా పెరుగుతన్న ధరల పెరుగుదలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతకడం తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. అంతే కాకుండా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఎద్దేవా చేశారు. అంతే కాకుండా.. నిండు సభలో పచ్చి వంకాయ దీన్ని అందరికి షాకింగ్ కు గురిచేశారు. ప్రస్తుతం కూరగాయాలు కొనే పరిస్థితిలేదని.. ఒక వేళ కొన్ని గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయని ఆమె ఈ రకంగా వ్యగ్యంగా తన నిరసన తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో  (Social media) తెగ వైరల్ (viral video) అయ్యింది.

తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది. టీఎంసీ ఎంపీ సీరియస్ గా ప్రసంగిస్తున్నప్పుడు మరో తృణముల్ నాయకురాలు మహువా మొయిత్రా (Mahua Moitra Hide Her Louis Vuitton Bag ) తన హ్యండ్ బ్యాగ్ ను దాచిపెడుతున్నారు. ఆమె లూయిస్ విట్టన్ బ్యాగ్ ను తీసుకుని కాళ్లదగ్గర దాచిపెట్టుకొవడం వైరల్ గా మారింది. దాని ఖరీదు.. దాదాపు రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ. దీన్ని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఒక వైపు కేంద్రాన్ని ధరల పెరుగుదలపై ట్రోల్ చేస్తు.. ఇంత కాస్లీ బ్యాగ్ ను లోక్ సభలో ఎలా తీసుకెళ్లాంటూ వ్యంగ్యంగా కామెంట్ లు చేస్తున్నారు. అయితే, రెబెల్ టీఎంసీ నాయకురాలు మహువా మోయిత్రాకు ఇలాంటి వివాదాలు కొత్తేమి కాదు.

గతంలో కూడా.. మహిళలపై నేరాలు జరుగుతున్న నేపథ్యంలో.. బీజేపీని టార్గెట్ చేశారు. అంతే కాకుండా.. ప్రధాని మోదీపై (PM Modi) పలు ఆరోపణలు చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో, ఆమె ఒక మీడియా కార్యక్రమంలో కాళీ దేవిపై చేసిన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రంగా నిలిచింది. కాళీ దేవతగా అలంకరించబడిన ఒక స్త్రీని ధూమపానం చేస్తున్నట్లు చూపుతున్న వివాదాస్పద ఫిల్మ్ పోస్టర్‌పై ఒక ప్రశ్నకు బదులిస్తూ, మొయిత్రా తన కాళీ దేవత మాంసం తినే, మద్యం స్వీకరించే దేవత అని అన్నారు. తన వాదనలకు మద్దతుగా, ఆమె పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్న ఐకానిక్ తారాపీఠ్ శక్తి పీఠ్ దేవాలయం గురించి ప్రస్తావించింది.

అక్కడ కాళీ దేవి యొక్క "మా తార" వెర్షన్‌ను ఆరాధించే సమయంలో మాంసం, మద్యం అందించబడుతుంది. బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఆమె ట్వీట్ చేస్తూ, “బీజేపీపైకి తీసుకురండి! నేను కాళీ ఆరాధకుడిని. నేను దేనికీ భయపడను. మీరు ఎది చెబితే అది గుడ్డిగా పాటించే దాన్ని కాదు.. అజ్ఞానులు కాదని చెప్పింది. మీరు ఏవిధంగా ట్రోల్స్ చేసిన భయపడే అవసరం లేదని మోయిత్రా స్పస్టం చేసింది. అంతే కాకుండా బీజేపీ నేత జితేన్ ఛటర్జీ, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ మొయిత్రాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Parliament, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు