DICTATOR KIM JONG UN GIVES HORRIBLE PUNISHMENT TO BOY FOR WATCHING PORN IN NORTH KOREA HERE THE DETAILS SRD
Kim Jong Un : పోర్న్ వీడియో చూస్తూ అడ్డంగా బుక్కైన బాలుడు..కిమ్ ఏం శిక్ష వేశాడో తెలుసా..
కిమ్ జోంగ్ ఉన్
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రూటే సపరేటు.. ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ను మించిన వారు ఎవ్వరూ లేరు.
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెబితే హడలిపోతారు. అతడు విధించే శిక్షల గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుంటుంది. ఈ ఉత్తర కొరియా అధినేత రూటే సపరేటు.. ప్రపంచమంతా ఓ దారిలో పయనిస్తుంటే ఆయన మాత్రం మరో దారిలో వెళతారు. ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇది జగమెరిగిన సత్యం. ఆయన వేసే శిక్షలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేశాడని సొంత బాబాయినే పెంపుడు కుక్కలతో చంపించాడని అప్పట్లో అనేక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరోసారి కిమ్ క్రూరత్వం బయటపడింది. పోర్న్ చూస్తూ పట్టుబడిన ఓ బాలుడికి భయంకరమైన శిక్ష విధించాడు ఈ నార్త్ కొరియా డిక్టేటర్. వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కాలంలో ఉత్తర కొరియా ప్రభుత్వం పోర్న్‌కు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది. అధికార వర్కర్స్ పార్టీ పాఠశాలల్లో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను షురూ చేసింది. ఉత్తర కొరియాలో మత్తు పదార్ధాల విక్రయించినా.. కొనుగోలు చేసినా.. సదరు వ్యక్తులకు మరణశిక్ష విధించేలా చర్యలు తీసుకున్నారు.
నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉద్దేశంలో పోర్న్ చూడటం.. సమాజాన్ని నాశనం చేయడం రెండూ ఒకటే. ఈ నేపధ్యంలో అక్కడ పోర్న్‌పై నిషేధం విధించారు. అయితే అనూహ్యంగా ఓ బాలుడు పోర్న్ చూస్తూ అడ్డంగా దొరికాడు. కంప్యూటర్ ఐపీ అడ్రెస్ ద్వారా అతడి ఇంటి చిరునామాను పోలీసులు ట్రేస్ చేశారు.ఇక ఈ విషయం నియంత కిమ్ వరకు చేరడంతో ఆయన ఆ బాలుడికి, అతని కుటుంబానికి భయంకరమైన శిక్షను విధించాడు.
ఆ కుటుంబాన్ని నార్త్ కొరియా నుంచి వెలివేయడమే కాకుండా సరిహద్దు ప్రాంతానికి తరిమేశాడు. బాలుడిని ఉరి తీయకపోవడం అదృష్టం అని అక్కడి స్థానిక మీడియా ఓ కథనాన్ని వ్యక్తం చేసింది. అటు ఆ బాలుడు చదివిన పాఠశాల ప్రిన్సిపాల్‌కు సైతం కిమ్ శిక్షను విధించాడు. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం, పాఠశాల పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దానికి పాఠశాల ప్రిన్సిపాలే బాధ్యత వహించాలి. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్‌కు శిక్ష విధిస్తూ.. అతన్ని కార్మిక శిబిరానికి పంపించారు. మొత్తానికి కిమ్ జోన్ ఉంగ్ విధించిన శిక్షపై ప్రపంచమంతా మరోసారి ఆయన గురించి చర్చించుకుంటోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.