మళ్లీ ‘మన్కడింగ్’ రచ్చ...కృనాల్‌పై మండిపడుతున్న ధోనీ ఫ్యాన్స్

IPL 2019: Dhoni Receives a 'Mankad' Warning | వీడియోను నిశితంగా చూస్తే కృనాల్ పాండ్యా ధోనీని మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించడం లేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అయితే ధోనీ వీరాభిమానులు మాత్రం ధోనీని మన్కడింగ్ చేసేందుకు కృనాల్ పాండ్యా ప్రయత్నించారంటూ మండిపడుతున్నారు.

news18-telugu
Updated: April 4, 2019, 6:51 PM IST
మళ్లీ ‘మన్కడింగ్’ రచ్చ...కృనాల్‌పై మండిపడుతున్న ధోనీ ఫ్యాన్స్
(Image credit: IPL / BCCI)
  • Share this:
ట్రోల్స్ బాధితుల జాబితాలో లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్ ఆటగాడు కృనాల్ పాండ్యా కూడా చేరిపోయాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీని కృనాల్ పాండ్యా మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో 14వ ఓవర్‌లో బౌలర్ కృనాల్ పాండ్యా బంతిని విసిరేందుకు ముందుకు వెళ్లి.. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. అయితే ధోనీ మాత్రం తన క్రీజ్‌ నుంచి బ్యాట్‌ని ఒక్క అంగుణం కూడా బయటకి తీయలేదు. దీనికి సంబంధించిన వీడియోని ఐపీఎల్ కూడా తమ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.వీడియోను నిశితంగా చూస్తే కృనాల్ పాండ్యా ధోనీని మన్కడింగ్ చేసేందుకు ప్రయత్నించడం లేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అయితే ధోనీ వీరాభిమానులు మాత్రం ధోనీని మన్కడింగ్ చేసేందుకు కృనాల్ పాండ్యా ప్రయత్నించారంటూ మండిపడుతున్నారు. ధోనీని మన్కడింగ్ చేసుంటే కృనాల్ దేశంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఎదురయ్యేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అటు మన్కడింగ్‌లో దొరికిపోవడానికి మిగిలిన వారిలా ధోనీ సాధారణ ఆటగాడుకారంటూ నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

(Image credit: IPL / BCCI)


ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ మన్కడింగ్ చేయడం పెను దుమారంరేపింది. అశ్విన్ మన్కడింగ్ క్రీడా స్ఫూర్తికే విరుద్ధమంటూ షేన్ వార్న్ మొదలుకొని పలువురు క్రికెట్ దిగ్గజాలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే రూల్స్‌లో ఉన్నదే అశ్విన్ చేశారని, దాన్ని తప్పుబట్టాల్సిన అవసంర లేదంటూ భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్...అశ్విన్‌కు బాసటగా నిలిచారు.

వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
First published: April 4, 2019, 6:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading