Home /News /trending /

DHANIRAM BARUA AN INDIAN DOCTOR FROM ASSAM IS CREDITED WITH IMPLANTING THE FIRST PIG HEART IN A MAN NOT THE AMERICANS SNR

మనిషికి తొలిసారిగా పంది గుండెను అమర్చింది నేనే.. ఎవరా భారతీయ డాక్టర్

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Assam: పంది గుండెను మనిషికి అమర్చిన ఘనత అమెరికా డాక్టర్లది కాదంటున్నారు ఓ భారతీయ డాక్టర్. 1997లో తానే తొలిసారిగా ఆ ఆపరేషన్‌ పూర్తి చేశానని చెప్పారు. పాతికేళ్ల క్రితం తాను చేసిన రీసెర్చ్‌ని ప్రోత్సహించి ఉంటే ఆ ఖ్యాతి, గుర్తింపు భారతదేశానికే దక్కేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది గుండెను అమర్చినట్లుగా అమెరికన్ వైద్యులు చేస్తున్న ప్రచారాన్ని ఇండియన్‌ సీనియర్‌ డాక్టర్ ఒకరు ఖండించారు. ఇది తొలిసారిగా జరగలేదంటున్నారు. పక్షవాతం కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికి ఆయన చేసిన ఆపరేషన్‌ గురించి న రీసెర్చ్‌ సైంటిస్ట్ డాక్టర్ సాయిగీత అచ్రేకర్‌(Dr Saigeeta Achrekar) ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. మనిషికి పంది గుండెను అమర్చడం ఇప్పుడు జరిగింది కాదని 25ఏళ్ల క్రితమే..అది కూడా మన భారతీయ వైద్యుడే చేసిన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 72ఏళ్ల వయసులో ఉన్న డాక్టర్ ధనిరామ్ బారువా(Dr Dhaniram Baruah)అస్సాం(Assam)లోని గువాహటి(Guwahati)లో 1997లోనే మనిషికి పంది గుండెను అమర్చినట్లుగా వెల్లడించారు. అమెరికా వైద్యులు ఇప్పుడు చేసిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ గురించి తెలుసుకున్న డాక్టర్‌ ధనిరామ్‌ బారువా ( Dhaniram Baruah)హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే అమెరికా వైద్యులు పంది గుండెను మనిషికి అమర్చే విషయంలో సరైన విధానాలు అనుసరించలేదన్నారు. 1997 జనవరి (January)లో హాంగ్‌కాంగ్‌(Hong kong)కు చెందిన జోనాథన్‌ హోకీ షింగ్‌ (Jonathan hoki shing)అనే హార్ట్‌ సర్జన్‌తో కలిసి సంచలన ప్రయోగం చేశారు బారువా. గుండెకు రంధ్రంపడిన ఓ 32 ఏళ్ల వ్యక్తికి సర్జరీ చేసి.. పంది గుండెను అమర్చారు. ఇప్పుడున్నంతగా వైద్య వసతుల్లేని ఆ కాలంలో, అదీ తన వైద్య కళాశాల లోనే ధనిరామ్‌ విజయవంతంగా ఈ సర్జరీ చేయ డం విశేషం. పంది గుండెతో వారం రోజుల పాటు బతికిన ఆ పేషెంట్‌.. పలు రకాల ఇన్ఫెక్షన్ల (Infections)కారణంగా వారం రోజుల తర్వాత చనిపోయాడు. దాంతో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. మనుషులకు పంది గుండె అమర్చడం అనైతికమని, సదరు పేషెంట్‌ మరణానికి ధనిరామ్‌ కారణమంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోగి మరణానంతరం అవయవ మార్పిడి చట్టాన్ని ఉల్లంఘించినందుకు బారువాను ఆ నాటి అస్సాం (Assam) ప్రభుత్వం 40రోజుల(40days)పాటు జైలులో పెట్టిన విషయాన్ని డాక్టర్‌ సాయిగీత అచ్రేకర్‌ తెలిపారు. బారువా జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన రీసెర్చ్‌ సెంటర్‌ పూర్తిగా ధ్వంసం చేయడంతో ఆయన ఏమి చేయలేని స్థితిలోకి వెళ్లపోయారని చెప్పారు డాక్టర్ అచ్రేకర్. 1990నుంచి డాక్టర్ బారువాతో కలిసి పనిచేస్తున్నారు అచ్రేకర్. భారత ప్రభుత్వం వైద్య పరిశోధనలకు ఎంతో ఖర్చు చేస్తోంది కానీ భారతదేశంలో ఉన్న బారువా లాంటి ఎందరో మేధావుల రీసెర్చ్‌లను ప్రోత్సహించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో పక్షవాతంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న బారువా నాటి తాను సాధించిన విజయానికి గర్వపడుతున్నారని తెలిపారు.

పాతికేళ్ల క్రితమే జరిగిందట..
జనవరి 7న అమెరికా వైద్యులు మనిషికి పంది గుండెను అమర్చిన విషయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలోని బాల్టిమోర్‌ మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో డేవిడ్‌ బెన్నెట్‌ అనే 57ఏళ్ల వ్యక్తికి ఈ అవయవదానం ఆపరేషన్ చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను మనిషికి అమర్చడం ద్వారా ప్రాణదానం చేసినట్లుగా వెల్లడించారు. సాధారణంగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్లలో బ్రెయిన్ డెడ్ వ్యక్తుల గుండెలను ఇతరులకు అమర్చుతారు. అయితే, అలాంటి సంప్రదాయ మార్పిడికి డేవిడ్ ఆరోగ్య పరిస్థితి అనుకూలించలేదు. కాబట్టే డాక్టర్లు అతనికి పంది గుండెను అమర్చారు.ఇందుకోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. పేషెంట్‌ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. గతేడాది అక్టోబర్‌లో న్యూయార్క్‌ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో వైద్యులు.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీని అమర్చే ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ఇప్పుడు మాత్రం బతికున్న డేవిడ్ బెన్నెట్‌కే పంది గుండెను అమర్చారు.

ప్రోత్సాహం లేక దక్కని గౌరవం..
ఈ మొత్తం ఆపరేషన్‌ విషయంలో గమ్మత్తైన విషయం ఏమిటంటే..ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి డేవిడ్‌ బెన్నెట్‌ ఏడేళ్ల క్రితం ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసినట్లుగా కొన్ని అమెరికా మీడియాలో వెల్లడైంది. అంతే కాదు అతను ఆరేళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించినట్లు, మృతుని కుటుంబానికి నష్టపరిహారం కూడా చెల్లించినట్లుగా అమెరికా పత్రికల్లో వెల్లడైంది.
Published by:Siva Nanduri
First published:

Tags: America, Assam, Surgery twit

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు