దీపావళి పండుగకు ప్రతి చోట లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏడాది పొడవున ఎలాంటి ఆర్దిక ఇబ్బందులు తలెత్తకుండా లక్ష్మీకటాక్షం కలిగిస్తుందని ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదంతా ప్రతి చోట జరుగుతుంది. కాని మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో అమ్మవారి ఆలయాన్ని ధన భాండాగారంగా మార్చారు. ఓ గొప్ప నిధుగా మార్చేశారు. ఇదంతా కేవలం పూజ కోసం కాదు..అమ్మవారి ఆలయంలో పూర్తిగా కరెన్సీ నోట్లతో దండలు, నోట్ల కట్టలతో అమ్మవారికి పట్టు పాన్పులు పరిచారు. ఇక వజ్రాలు, వైఢూర్యాలు, నగలు, విలువైన స్వర్ణ సంపదకు నెలవుగా మారింది. ఇంతకీ ఈ ఆలయం విశిష్టత తెలియాలంటే మధ్యప్రదేశ్‌లోని రత్లాం(Ratlam)జిల్లా కేంద్రంలోని మనక్ (Manak Chowk)చౌక్()లో మహాలక్ష్మీజీ ఆలయాన్ని(Mahalakshmiji Temple) ఈ దీపావళి(Diwali)పర్వదినాల్లో సందర్శిస్తే తెలుస్తుంది.
నగలు, నగదుతో ఆలంకారం..
రత్లామ్ జిల్లా కేంద్రంలోని మనక్ చౌక్‌లోని మహాలక్ష్మిజీ ఆలయం మరోసారి కుబేరుని నిధి అలంకరించబడింది. ప్రతి దీపావళికి ముందు అమ్మవారి ఆలయాన్ని డబ్బులు, బంగారు నగలతో అలంకరిస్తారు. ఈవిధంగా ఐదు రోజుల పాటు నగదు, నగలతో అమ్మవారికి అలంకరించి దీపావళి ముగిసిన తర్వాత ఎవరు సమర్పించిన నగదు, నగలను వాళ్లు తీసుకుంటారు. ఈవిధంగా కష్టపడి సంపాధించిన కోట్లాది రూపాయల సొమ్మును ఒక ఆలయాన్ని భద్రపరచడం, అమ్మవారికి అలంకారం చేయడం దేశంలోనే ఎక్కడా జరగదు. ఈ ఆలయంలోనే జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఐదు రోజుల పాటు లక్ష్మీ అవతారం..
రత్లాంలోని ఈ మహాలక్ష్మి ఆలయంలో కొన్నేళ్లుగా ఆభరణాలు, రాశులను సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ విధంగా తమకు నచ్చినంత డబ్బు, ఇష్టమైన బంగారు ఆభరణాలను ఆలయంలో అమ్మవారికి అలంకరించాలనుకునే అవకాశం అతి తక్కువ మందికి లభిస్తుంది. అందుకే చాలా మంది తమ డబ్బు, నగలను అమ్మవారికి అలంకరించడానికి ముందు ఫోటోతో పాటు రిజిస్టర్లో నమోదు చేసుకొని ఐదు రోజుల పూజ తర్వాత అమ్మవారి ప్రసాదంతో పాటు ఇచ్చిన డబ్బు, నగలను తిరిగి వెనక్కి ఇస్తారు ఆలయ అధికారులు. ఐదు రోజుల పాటు ఆలయంలో ఉంచే కోట్లాది రూపాయల సొమ్ము, సొత్తును కంటికి రెప్పలా కాపాడేందుకు సీసీ కెమెరాలతో పాటు పోలీసులను కాపలాగా ఉంచడం జరుగుతుంది.
అమ్మవారి ఆలయంలో నిధి..
ప్రతి ఏడాది భక్తులు అమ్మవారి ఆలయాన్ని కుభేర నిధిగా మార్చినట్లే ఈసారి కూడా గోల్డెన్ బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, కరెన్సీ కట్టలతో అమ్మవారి ఆలయాన్ని నిధి, నిషేపాలతో నింపేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో నగలు, నగదు పెట్టడం వల్ల ఏడాది పొడవున సంపదకు లోటు ఉండదనే నమ్మకంతో భక్తులు ఈ విధంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు ఆలయంలో అమ్మవారికి ఆలంకారంగా ఉంచిన డబ్బును మహాప్రసాధంగా భావించి ఖర్చు కూడా చేయరు.
చరిత్ర చెప్పిన కథ..
అయితే ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. రత్లాం మహారాజా రట్లం జోధ్‌పూర్ నుండి రత్లాంకు తిరిగి వచ్చినప్పుడు, శ్రీమాలి బ్రాహ్మణ సమాజానికి చెందిన అనేక కుటుంబాలు అతనితో పాటు రత్లాంలో స్థిరపడ్డాయి. రత్లాంలోని ఈ శ్రీమాలి బ్రాహ్మణ సమాజం రత్లాం నగరంలో నాలుగు మహాలక్ష్మి ఆలయాలను స్థాపించింది. ఇందులో, శ్రీ మాలి మనక్ చౌక్‌లో ఉన్న నాల్గవ తరగతి బ్రాహ్మణుల దేవత, మా మహాలక్ష్మి.అందుకే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Trending news, Viral Video