ఈమధ్య కాలంలో హార్ట్ ఎటాక్(Heart attack)తో చనిపోతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఏదో ఒత్తిడికి లోనై గుండెపోటుతో చనిపోయే వాళ్లుంటారు. కాని వేడుకలు, పండుగల సమయంలో నాటికలు, దాండియా ఆడుతూ కుప్పకూలిపోయిన వాళ్లను చూశాం. తాజాగా బిహార్(Bihar)లో హనుమాన్ జయంతి (Hanuman Jayanti)సందర్భంగా తులసీదాస్(Tulsidas)రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్(Retired Professor)అదే స్టేజిపై ప్రాణాలొదిలారు. రాముడి కథ చెప్తూ చెప్తూ గుండె పోటుకు గురై కుప్పకూలాడు.
వైరల్ వీడియో..
బిహార్‌లోని చాప్రా నగరంలోని మారుతీ మానస్ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల చివరి రోజు కావడంతో శనివారం ఆలయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్‌సింగ్ తులసీదాస్ అనే పెద్దాయన రామాయణంలోని వాక్యాలు వినిపిస్తూ రాముడు గుణ, గణాలను వివరిస్తుండగా గుండె పోటు వచ్చింది. వేదికపైనే రిటైర్డ్ ప్రొఫెసర్ చేతిలో మైక్‌తోనే వెనక్కి కుప్పకూలిపోయాడు. అక్కడే ున్న నిర్వాహకులు గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు అప్పటికే తులసీదాస్ మృతి చెందినట్లుగా చెప్పారు.
హార్ట్ ఎటాక్ ..
ఛాప్రాలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రామాయణ కథోలోని సారాంశాన్ని వివరిస్తూ ప్రాణాలు వదలడం లైవ్‌లో చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అంతే కాదు రిటైర్డ్ ప్రొఫెసర్ హార్ట్ ఎటాక్‌కు గురి కావడం స్టేజిపైనే పడిపోవడం అంతా ఫోన్లలో రికార్డ్ కావడంతో ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దావానలంలా పాకిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్‌గా మారింది.
దేవుని పేరు జపిస్తూనే ..
మారుజీ మానస్ ఆలయంలో అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించే రిటైర్డ్ ప్రొఫెసర్ గుండెపోటుతో చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున పురప్రజానీకం వచ్చిన ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. భగవంతుడి పేరు తలుస్తూ ప్రాణాలు వదలడం తులసీదాస్ చేసుకున్న పుణ్యమని స్థానికులు చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Trending news, Viral Video