పెళ్లిలో వరమాల వేడుక అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. వరమాల వేడుకలో పూలదండలు మార్చుకునే క్రమంలో వధూవరులిద్దరూ ఒకరికొకరికి మరింత దగ్గరవుతారు. ఈ మధుర క్షణాల్లో వారు తమ బంధాన్ని దృఢపరుచుకుంటారు. వరమాలలతో తమ దాంపత్య బంధాన్ని మరింత బలపర్చుకుంటారు. పెళ్లిళ్లలో ఎప్పట్నుంచో వస్తున్న ఈ వరమాల సంప్రదాయం వివాహ వేడుకల మొత్తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వరమాల వేడుకలు చాలా వినూత్నంగా జరుగుతున్నాయి. తాజాగా కూడా వధూవరులిద్దరూ తమ వరమాల వేడుకను భలే ముచ్చటగా జరుపుకున్నారు. ఇక్కడ వరుడు ముద్దిస్తే గానీ వరమాల మెడలో వేయనని వధువు చెంత బెట్టు చేశాడు. మొదట్లో వధువు ముద్దు ఇవ్వనని చెప్పినా ఆ తర్వాత వరుడు కాస్త బతిమిలాడటంతో కాదనలేక చుమ్మా అంటూ చిన్న కిస్ ఇచ్చేసింది. అప్పుడు గానీ అతడు ఆమె మెడలో వరమాల వేయలేదు. ఈ క్యూట్ పెళ్లి వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసులను పులకింపచేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు వరుడు చాలా చిలిపి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
వైరల్ అయిన వీడియోలో మిరుమిట్లు గొలిపే రెడ్ వెడ్డింగ్ డ్రెస్ లో పంచదార బొమ్మలా కనిపించింది వధువు. వరుడు చేతిలో వరమాలతో కనిపించాడు. అప్పటికే ఈ వధువు వారి మెడలో వరమాల వేసింది. కానీ వరుడు మాత్రం వధువు మెడలో వరమాల వేసేందుకు ఒప్పుకోలేదు. బుగ్గ మీద ముద్దు పెడితే గానీ తాను మెడలో పెళ్లి దండ వేయనని బంధుమిత్రుల సమక్షంలో అందరూ చూస్తుండగానే అడిగేశాడు. దాంతో వధువు మొహంలో సిగ్గు మొగ్గలేసింది.
కిస్ ఇవ్వడం కుదరదన్నట్లు తల అడ్డంగా ఊపింది. కానీ వరుడు ప్రేమగా బతిమిలాడటంతో కరిగిపోయి బుగ్గ మీద కిస్ తెచ్చింది. ఆ వెంటనే అతడు ఆమె మెడలో వరమాల వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన బంధుమిత్రులు కేరింతలు కొట్టారు. ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
అయితే విట్టి వెడ్డింగ్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది. "వరమాల విత్ ఏ ట్విస్ట్. కాలేజీ లవ్ ను పెళ్లి చేసుకుంటే మండపంలో ఇలానే కిస్ అడుగుతారు" అంటూ విట్టి వెడ్డింగ్ ఒక క్యాప్షన్ జోడించింది. ఈ పెళ్లి కూతురు పేరు అన్మోల్ శెరావత్ అని వరుడి పేరు అభిషేక్ శర్మ అని ఈ పేజీ వెల్లడించింది. ఈ వీడియోకి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 17 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రతి వారు ఇలాగే పెళ్లికూతురు ముద్దు అడగాల్సిందే అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.