యువతి నోట్లో 60 పళ్లు... డెంటల్ కంపెనీ యాడ్‌ చూసి నెటిజన్లు షాక్

ఆ డెంటల్ కంపెనీ ఇచ్చిన యాడ్ ఆన్‌లైన్‌లో తుఫానులా మారింది. నెటిజన్లు దాన్ని చూసి... తిట్టిపోస్తున్నారు. ఎవరికైనా 60 పళ్లు ఉంటాయా అని మండిపడుతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 10:56 AM IST
యువతి నోట్లో 60 పళ్లు... డెంటల్ కంపెనీ యాడ్‌ చూసి నెటిజన్లు షాక్
హైయ్ స్మైల్ ఫొటో (Image : instagram - hismileteeth)
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 10:56 AM IST
అత్యుత్సాహానికి పోయిన డెంటల్ కంపెనీ 'హాయ్ స్మైల్'... ఓ యువతి నవ్వుతున్న ఫొటోను తన యాడ్‌లో పెట్టింది. ఆ ఫొటోలో ఆమె నోట్లో దాదాపు 60 దంతాలు కనిపిస్తున్నాయి. ఫొటోతో పాటూ తాను అందించే సర్వీసులను ఆ యాడ్‌లో ఇచ్చింది. ఐతే... ఆ ఫొటోపై నెటిజన్లకు కోపం వస్తోంది. ముత్యాల్లా పళ్లు మెరవడంలో తప్పేమీ లేదు గానీ... అవి దాదాపు 60 దాకా ఉండటమే నెటిజన్లకు నచ్చట్లేదు. అలా ఎక్కడైనా, ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. ఎంత డెంటల్ యాడ్ అయితే మాత్రం... అసాధారణంగా చూపిస్తారా అని మండిపడుతున్నారు. గ్రాఫిక్స్‌లో చేసిన మార్పుల వల్ల... ఒక దంతం ఉండాల్సిన ప్రదేశంలో రెండు దంతాల చొప్పున కనిపిస్తున్నాయి. ఆ ఫొటో వెంటనే ఆకర్షిస్తున్నప్పటికీ... దంతాలు అలా ఉండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 
Loading...

View this post on Instagram
 

We’ll whiten ALL your teeth 🦷 Tag a friend to trigger them


A post shared by HiSmile Teeth Whitening (@hismileteeth) on

మామూలుగా ఎవరికైనా 32 దంతాలుంటాయి. ఇక్కడ 60 పళ్లు చూపిస్తూ... మీ దంతాలన్నీ మేం వైటెనింగ్ చేస్తాం అని యాడ్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ని దాదాపు 10 వేల మంది లైక్ చేశారు. వేల మంది దీనిపై రకరకాల కామెంట్లు చేశారు. ఇలా ఎవరు ఎడిట్ చేశారోగానీ... నాకు నచ్చలేదని రాశారు ఓ నెటిజన్. నాకే గనక ఇన్ని పళ్లుంటే... నేను కచ్చితంగా వాటిని తగ్గించుకోవడానికి హాస్ స్మైల్‌కి వెళ్లేవాణ్నే అని సెటైర్ వేశారు మరో యూజర్. ఇలాంటివి చూస్తే పీడకలలు రావడం గ్యారెంటీ అని మరో వ్యక్తి మండిపడ్డారు.

యాడ్‌పై నెటిజన్ల కామెంట్లు
First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...