Video : ఒక్కడి కోసం విమానం... ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు...
Delta Plane : ఈ రోజుల్లో విమాన టికెట్లకు మంచి డిమాండ్ ఉంది. జర్నీ టైమ్ దగ్గర పడుతున్నకొద్దీ టికెట్ల రేట్లు పెంచేస్తూ... ఫుల్ రష్‌తో పనిచేస్తున్నాయి ఫ్లైట్ కంపెనీలు. అలాంటిది ఆ విమానంలో మాత్రం ఒక్కడే ప్రయాణించాడు. దాని వల్ల విమాన సిబ్బంది పడిన ఇబ్బంది తెలుసుకొని తీరాల్సిందే.

డెల్టా విమానం (Image : Twitter - alluretravelsng)
- News18 Telugu
- Last Updated: August 18, 2019, 12:53 PM IST
నదిలో బోట్ వెళ్లాలంటే... అందులో కూర్చొనే వాళ్లు... అన్ని వైపులా సమానంగా కూర్చోవాలి. అలా కాకుండా... ఒకవైపే అందరూ కూర్చుంటే... ఆ బోట్ పక్కకు ఒరిగి... చివరకు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదే ఫార్ములా విమానానికి కూడా వర్తిస్తుంది. విమానం గాల్లో ఎగిరేటప్పుడు... దాన్లో ఎంత మంది ప్రయాణికులు ఉంటారు, వాళ్ల బరువు ఎంత అన్నదాన్ని బట్టీ... దాని బ్యాలెన్స్ ఆధారపడి ఉంది. అలాంటిది... ఆ విమానంలో ఒక్కడే ప్రయాణికుడు ఉండటంతో... విమాన సిబ్బందికి సరికొత్త సవాల్ ఎదురైంది. ఒక్కడితో విమానం గాల్లో ఎగరాలంటే... బ్యాలెన్స్ తేడా వచ్చేస్తుంది కాబట్టి... అప్పటికప్పుడు ఇసుక బస్తాల్ని తెచ్చి... అక్కడక్కడా సీట్లలో వాటిని పెట్టాల్సి వచ్చింది. ప్రయాణికుల స్థానంలో ఇసుక బస్తాల్ని పెట్టడం ద్వారా... విమానం సరైన బ్యాలెన్స్‌లో వెళ్లేలా చేశారన్నమాట.
ఇదంతా ఎక్కడ జరిగిందంటే... ప్రముఖ రైటర్, డైరెక్టర్ విన్సెంట్ పియోన్... కొలరాడోలోని ఆస్సెన్ నుంచీ సాల్ట్ లేక్ సిటీకి వెళ్లేందుకు డెల్టా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాక తెలిసింది... విమానంలో ప్రయాణించబోయేది అతను ఒక్కడే అని. షాకయ్యాడు. ఇంకెవరూ టికెట్లు బుక్ చేసుకోలేదా అంటే... లేదని చెప్పారు ఉద్యోగులు. భలే అయ్యిందే అనుకుంటూ... తన ఎక్స్‌పీరియన్స్‌ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
ఒక్కడే ప్రయాణించినా... విమాన సిబ్బంది మాత్రం ఆయనకు అన్ని మర్యాదలూ అందించారు. తన విషయంలోనే ఇలా జరిగిందేమో అనుకున్న విన్సెంట్... అదే విషయమై విమాన సిబ్బందిని అడగ్గా... అప్పుడప్పుడూ ఇలాంటి పరిస్థితి వస్తుంటుందని వాళ్లు చెప్పారు. ఏది ఏమైనా విమాన ప్రయాణమే ఓ ఆసక్తికర జర్నీ. అందులోనూ ఒక్కరే ప్రయాణించడం మాటలకు అందని అనుభూతి. ఇక ఇసుక బస్తాలు వేసి మరీ తీసుకెళ్లడం మరో లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్.
Last week @Delta gave me my own private jet...kind of. pic.twitter.com/p14OGLw1jv
— vincent peone (@vincentpeone) August 12, 2019
ఇదంతా ఎక్కడ జరిగిందంటే... ప్రముఖ రైటర్, డైరెక్టర్ విన్సెంట్ పియోన్... కొలరాడోలోని ఆస్సెన్ నుంచీ సాల్ట్ లేక్ సిటీకి వెళ్లేందుకు డెల్టా విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాక తెలిసింది... విమానంలో ప్రయాణించబోయేది అతను ఒక్కడే అని. షాకయ్యాడు. ఇంకెవరూ టికెట్లు బుక్ చేసుకోలేదా అంటే... లేదని చెప్పారు ఉద్యోగులు. భలే అయ్యిందే అనుకుంటూ... తన ఎక్స్‌పీరియన్స్‌ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్ సినిమాలన్నీ చూసే చాన్స్...
ఆన్లైన్లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
లక్ష కోట్లు దాటి జీఎస్టీ వసూళ్లు...కేంద్రానికి ఊరట...
కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు షాక్...ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎన్ఎస్ఈ
Loading...
— vincent peone (@vincentpeone) August 15, 2019