news18-telugu
Updated: January 13, 2021, 9:40 AM IST
Twitter image
ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో చలి తీవ్రమైంది. మంచు విపరీతంగా కురుస్తోంది. రహదాలను మంచు కప్పేస్తోంది. వాహనాల రాకపోకలకను తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంతో ఓ ఈ- కామర్స్ సంస్థకు చెందిన డెలివరి ఏజెంట్ కొత్త ఆలోచన చేశాడు.
సాధారణంగా ఈ-కామర్స్ నుంచి డెలివరీలు బైక్పేనే ఎక్కువగా తెస్తారు ఏజెంట్లు. ఒకవేళ వస్తువు పెద్దదైతే వ్యాన్ తీసుకొస్తారు. అయితే కశ్మీర్లో ఓ డెలివరి ఏజెంట్ కొత్తగా, అందరినీ ఆకర్షించేలా ప్రయత్నం చేశాడు. మంచు ఉన్న రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తున్నారు. గుర్రంపైనే వచ్చి కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు.
శ్రీనగర్‌కు చెందిన అమెజాన్ డెలివరి ఏజెంట్ ఇలా గుర్రంపై ప్రయాణిస్తూ డెలివరీలు చేస్తున్నాడు. తాజాగా ఉమర్ జనీ అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో విపరీతంగా వైరల్‌గా అవుతోంది. వేలకొద్ది వ్యూస్, కామెంట్లు, లైక్‌లు వస్తూనే ఉన్నాయి.
ఆ డెలివరీ ఏజెంట్‌ను, ఆ ఈ కామర్స్ సంస్థను నెజిటన్లు పొగిడేస్తున్నారు.
In our social work profession, there is one principle called Use of Local Indigenous Resources ❤️ https://t.co/nbwC2KyuHD
తీవ్రమైన చలిలో మంచు కురుస్తున్నా డెలివరీ చేస్తున్నారని, అతడి అకింతభావం గొప్పదని కొందరు కామెంట్లు చేస్తుంటే.. అమెజాన్ వస్తువులకు కొత్త రైడ్ అంటూ మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు.
Published by:
Krishna P
First published:
January 13, 2021, 9:40 AM IST