హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అర్దరాత్రి ఏకాంతంగా రోడ్డు మీద వెళ్తున్న యువతి.. ఆగంతకుడు ఏం చేశాడంటే..

అర్దరాత్రి ఏకాంతంగా రోడ్డు మీద వెళ్తున్న యువతి.. ఆగంతకుడు ఏం చేశాడంటే..

యువతిపై దాడిచేస్తున్న ఆగంతకుడు

యువతిపై దాడిచేస్తున్న ఆగంతకుడు

Delhi: యువతి రోడ్డు మీద సింగిల్ గా ఫోనులో మాట్లాడుకుంటూ వెళ్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. అంతే కాకుండా.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొందరు కామాంధులు మహిళలు,యువతులనే టార్గెట్ చేస్తుంటారు. అమ్మాయిలు సింగిల్ కన్పిస్తే చాలు, అఘాయిత్యాలకు తెగబడుతుంటారు. మరికొందరు.. వారి దగ్గర నుంచి కాస్లీ వస్తువులను దోచుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో మహిళలపై దాడులు చేయడం, కొన్నిసార్లు చంపడానికి కూడా వెనుకాడరు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi)  షాకింగ్ ఘటన జరిగింది. బదర్ పూర్ ఏరియాలో సెప్టెంబరు 4న ఒక అమ్మాయి, తన స్నేహితులను కలుసుకోని తిరిగి వస్తుంది. ఆమె వచ్చేటప్పటికి రాత్రి అయ్యింది. అప్పుడు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతూ సింగిల్ గా వెళ్తుంది. ఈ క్రమంలో ఆగంతకుడు ఒక్కసారిగా ఆమెపై దాడిచేశాడు. అంతే కాకుండా.. ఆమె దగ్గర నుంచి ఫోను లాక్కొడానికి ట్రై చేశాడు. ఆమెతో గొడవ పడ్డాడు.యువతి కూడా ఏమాత్రం తగ్గకుండా.. ఫోను అతని చేతిలోకి వెళ్లకుండా,తన బలాన్నంతా ప్రయోగించి అతడిని ప్రతిఘటించింది. అంతే కాకుండా.. భయపడకుండా అతనిపై దాడిచేసింది. మొత్తానికి యువతి తన ఫోను అతని చేతిలో వెళ్లనీయకుండా చివరి వరకు పోరాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా  ఒక ఏనుగు (Elephant) అడవికి దగ్గరగా ఉన్న రోడ్డు మీదకు వచ్చింది.
అప్పుడు దానికి దగ్గర నుంచి ఒక వ్యక్తి తన కారును తీసుకొచ్చాడు. ఏనుగును సమీపంలోని దగ్గర నుంచి చూడాలను కున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. అప్పుడు ఏనుగుకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే కారు మీద తన ప్రతాపం చూపించింది. తన కాలితో కారు టైరు ను బలంగా నొక్కిపడేసింది.
అంతే కాకుండా.. కారును వెనక్కు తోసేసింది. అప్పటికి దాని కోపం చల్లారనట్లుంది.. ఇక లాభంలేదని.. ఏకంగా కారు మీద ఎక్కి.. దాన్ని అద్దాలు పగిలిపోయేలా బలంగా తుండంతో కారు ముందు భాగాన్ని ధ్వంసం చేసింది. దీంతో భయపడిపోయిన డ్రైవర్.. కారును వెనక్కు పోనిచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  తెగ వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Robbery, Viral Video

ఉత్తమ కథలు