• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • DELHI TO VARANASI FLIGHT PASSENGER TRIED TO OPEN THE EMERGENCY EXIT DOOR MID AIR SSR

Delhi to Varanasi Flight: విమానం గాల్లో ఉండగా ఇదేం పిచ్చి పని.. ఢిల్లీ టూ వారణాసి విమానంలో ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం ఈ ఘటన జరిగినట్లు స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. వారణాసి వెళ్లేందుకు స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించిన గౌరవ్ అనే వ్యక్తి సీటులో నుంచి సడన్‌గా లేచి విమానం గాలిలో వెళుతున్న సమయంలో...

  • Share this:
    వారణాసి: మార్చి 27, 2021న ఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన స్పైస్‌జెట్(ఎస్‌జి-2003) విమానంలో ఓ వ్యక్తి నానా హంగామా చేశాడు. విమానం గాలిలో వెళుతున్న సమయంలో ఎమర్జన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. అలా చేయకూడదని చెప్పిన సిబ్బందిని నోటికొచ్చినట్టు తిట్టేశాడు. అతని మూర్ఖపు చర్యతో తోటి ప్రయాణికులకు ఏసీలో కూడా చెమటలు పట్టాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం ఈ ఘటన జరిగినట్లు స్పైస్‌జెట్ ఓ ప్రకటనలో తెలిపింది. వారణాసి వెళ్లేందుకు స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించిన గౌరవ్ అనే వ్యక్తి సీటులో నుంచి సడన్‌గా లేచి విమానం గాలిలో వెళుతున్న సమయంలో ఎమర్జన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి చర్యతో తోటి ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వదేమోనని కంగారు పడ్డారు. అయితే.. అతనిని గమనించిన విమానంలోని మహిళా సిబ్బంది, తోటి ప్రయాణికులు కలిసి ఆ వ్యక్తిని నిలువరించారు. ఎట్టకేలకు విమానం వారణాసి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో మొత్తం 89 ప్రయాణికులు ప్రయాణించినట్లు స్పైస్‌జెట్ తెలిపింది. విమానం ల్యాండ్ అవగానే.. తన పిచ్చి చేష్టలతో అందరికీ దడ పుట్టించిన గౌరవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికుడు 1సీలో ప్రయాణించినట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. విమానం టేకాఫ్ అవగానే కాసేపు అటూఇటూ తిరిగిన ఆ ప్రయాణికుడు ఉన్నట్టుండి ఎమర్జన్సీ డోర్‌ను తీసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. ఈ ఘటనపై డీజీసీఏకు సదరు విమానయాన సంస్థ ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి పేరును నో ఫ్లై లిస్ట్‌లో చేర్చే అవకాశమున్నట్లు తెలిసింది. అతని మానసిక స్థితి సరిగా లేదేమోనన్న అనుమానాన్ని తోటి ప్రయాణికులు వ్యక్తం చేశారు.

    మార్చి తొలి వారంలో ఢిల్లీ నుంచి పుణె వెళుతున్న ఇండిగో విమానంలో కూడా ఓ ప్రయాణికుడి చెప్పిన విషయం తోటి ప్రయాణికుల్లో గుబులు రేపింది. తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. సరిగ్గా విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఆ వ్యక్తి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ వ్యక్తి చెప్పిన విషయంతో కంగుతిన్న పైలట్ విమానాన్ని రన్‌వే మీద నుంచి ట్యాక్సీ-బే వద్దకు తీసుకెళ్లి ఆపి ప్రయాణికులందరినీ దించేశాడు. విమానాన్ని శానిటైజ్ చేసి సీట్ కవర్స్‌ను మార్చిన తర్వాత మళ్లీ ఆ విమానం కదిలింది. ఆ వ్యక్తి చేసిన పని వల్ల ఫ్లైట్ దాదాపు రెండు గంటలు ఆలస్యంగా కదిలింది.
    Published by:Sambasiva Reddy
    First published: