హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : క్లాస్ రూమ్ లో డ్యాన్స్ ఇరగదీసిన యంగ్ టీచర్..సోషల్ మీడియా షేక్

Viral Video : క్లాస్ రూమ్ లో డ్యాన్స్ ఇరగదీసిన యంగ్ టీచర్..సోషల్ మీడియా షేక్

క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్

క్లాస్ రూమ్ లో టీచర్ డ్యాన్స్

ఉపాధ్యాయురాలు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నృత్యాన్ని చూస్తుంటే మనస్సులో తెలియని సంతోషం ఉప్పొంగుతుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. నెమలి నాట్యమాడినట్లుగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Teacher Dance In Classroom : స్కూల్‌ ఫంక్షన్స్, పార్టీల్లో విద్యార్థులు డ్యాన్స్‌ చేయడం సర్వ సాధారణమే. అప్పుడప్పుడూ టీచర్లు కూడా సందర్భాన్ని బట్టి డ్యాన్స్‌ చేస్తుంటారు. అయితే స్టూడెంట్స్‌, టీచర్లు కలిసి స్టెప్పులేస్తే..అది కూడా క్లాస్‌రూమ్‌లో చేస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యాలే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో(Delhi Govt School)కనిపించాయి. ఉపాధ్యాయులు అంటే కేవలం విద్యను బోధించే వారు మాత్రమే కాదని, క్లాస్‌రూమ్‌లో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడమే కాకుండా వారితో కలిసి ఆనందంగా డ్యాన్స్‌ చేశారు(Teacher Dance). ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో సమ్మర్ క్లాసెస్ ముగింపు సందర్భంగా మను గులాటి(Manu Gulati)అనే ఓ ఉపాధ్యాయురాలు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థినిలతో డ్యాన్స్ చేయించడంతో పాటు వారితో కలిసి ఆమెకూడా స్టెప్పులు వేసింది. విద్యార్థినిల‌తో క‌లిసి ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్ లోని సాంగ్ కి త‌ర‌గ‌తి గ‌దిలో డ్యాన్స్ చేశారు. విద్యార్థులు కొద్దిగా తడబడినా.. టీచర్ మాత్రం స్టెప్పుల్లో లయ తప్పలేదు.

టీచర్ మను గులాటి స్వయంగా తన ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. వేసవి శిబిరం చివరి రోజున మా అసంపూర్ణ నృత్యం. ఆనందం, కలయిక తోడైతే కొన్ని కచ్చితమైన స్టెప్పులకు దారితీస్తుంది అంటూ టీచర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. .ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు,కామెంట్స్ వస్తున్నాయి. వీడియోలో... విద్యార్థినిలందరూ ఒకలైన్‌లో నిల్చొని ఒకరి తరువాత ఒకరు స్టెప్పులతో అదరగొట్టారు. చివర్లో టీచర్‌, అమ్మాయిలు అంతా కలిసి చేయడం హైలెట్‌గా నిలిచింది. ఉపాధ్యాయురాలు చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నృత్యాన్ని చూస్తుంటే మనస్సులో తెలియని సంతోషం ఉప్పొంగుతుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. నెమలి నాట్యమాడినట్లుగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.


నా భర్త అమ్మాయిలా రెడీ అవుతున్నాడు..శృంగారం చేయట్లేదు..కోర్టు మెట్లెక్కిన మహిళ

ఢిల్లీ ప్రభుత్వ టీచర్ అయిన మను గులాటీ ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో అవార్డులు అందుకుంది. 2018లో కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నేషనల్ టీచర్స్ అవార్డు కూడా అందుకుంది. గతంలో కూడా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్ధినితోపాటు మను గులాటీ డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

First published:

Tags: Delhi, Teacher, Viral Video

ఉత్తమ కథలు