Home /News /trending /

DELHI SHOP SELLS GOLD PLATED MITHAI FOR RS 16000 PER KG VIDEO GOES VIRAL HERE IS NETIZENS REACTION GH SK

Viral Video: వామ్మో.. కేజీ స్వీటు రూ.16వేలా.. ఎక్కడ? ఏంటి దాని ప్రత్యేకత?

కిలో స్వీటు రూ.16 వేలు

కిలో స్వీటు రూ.16 వేలు

Gold Plated Sweet: సాధారణంగా కాజు కట్లీ స్వీట్లను వెండి పూతతో తయారుచేస్తారు. ఇప్పటివరకు ఇండియాలోని ఏ స్వీట్ షాపు బంగారు పూతతో మిఠాయిలను తయారు చేయలేదు. ఇది మొట్ట మొదటి షాప్ అని నిర్వాహకులు చెబుతున్నారు.

భారతదేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వీట్లను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా శుభకార్యాల్లో లేదా పండగ సమయాల్లో కేజీల చొప్పున తీపిపదార్ధాలు (Sweets) కొనుగోలు చేస్తుంటారు. కొత్త కొత్త రుచులను ట్రై చేసేందుకు కూడా ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. వీరిని ఆకట్టుకునేందుకు స్వీట్ షాప్ తయారీదారులు (Sweet Shops makers) ఎప్పటికప్పుడు కొత్త రకం మిఠాయిలు పరిచయం చేస్తుంటారు. అయితే తాజాగా ఢిల్లీలోని ఒక స్వీట్ షాప్ కూడా ఒక సరికొత్త మిఠాయి తయారు చేసింది. ఈ మిఠాయి కేజీ ధర అక్షరాలా 16 వేల రూపాయలు. అవాక్కయ్యారు కదూ.. కస్టమర్లు కూడా వీటి ధర చూసి నోరెళ్లబెడుతున్నాయి. అయినప్పటికీ వాటిని టేస్ట్ చేసేందుకు కొందరు ఎగబడతున్నారు. ఎందుకంటే వీటిని బంగారం పూత(gold-plated methai)తో తయారు చేశారు. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లోని షాగూన్ స్వీట్స్ షాపు ఈ బంగారు పూత మిఠాయిలను విక్రయిస్తోంది. ఈ మిఠాయిల తయారీకి సంబంధించిన వీడియోని @oye.foodieee అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అరచేతి నిండా రక్తపు రంధ్రాలు.. మరో భయంకరమైన వైరస్‌ వచ్చిందా? ఆ వీడియో ఎక్కడిది?
సాధారణంగా కాజు కట్లీ స్వీట్లను వెండి పూతతో తయారుచేస్తారు. ఇప్పటివరకు ఇండియాలోని ఏ స్వీట్ షాపు బంగారు పూతతో మిఠాయిలను తయారు చేయలేదు. అయితే తాజాగా ఢిల్లీలోని షాగూన్ స్వీట్స్ షాపు బంగారు పూత పూసిన మిఠాయిని విక్రయిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. @oye.foodieee పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో షాగూన్ స్వీట్స్‌లో ఒక చెఫ్ గోల్డెన్ ప్లేటెడ్ మిఠాయిలు ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోలో చెఫ్ మిఠాయిపై బంగారు పూతను ఉంచడం కనిపిస్తుంది. అతను దానిని బటర్ పేపర్‌తో నొక్కి, ఆపై మిఠాయిలను ముక్కలుగా కోస్తాడు. ఆ తరువాత మిఠాయిలను కుంకుమ పువ్వు లేదా కేసర్‌తో అలంకరించి ఆపై కస్టమర్లకు అందించడం జరుగుతుంది.

ఆ లేడీ డాక్టర్‌కి కోటి రూపాయలు కావాలంట..అంత డబ్బుతో ఏం చేస్తుందో తెలుసా..

బంగారు పూత పూసిన మిఠాయి కిలో ధర రూ.16,000 అని సదరు షాపు చెబుతోంది. " బంగారం పూత పూసిన కేజీ మిఠాయి ధర రూ.16000. దీన్ని ట్రై చేసే మీ రిచ్ స్నేహితుడిని ట్యాగ్ చేయండి. లొకేషన్ షాగూన్ స్వీట్స్, మౌజ్‌పూర్, ఢిల్లీ," అని ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓ క్యాప్షన్ జోడించింది. ఇప్పటికే ఈ వీడియోకి 15 మిలియన్ల వరకు వ్యూస్ వచ్చాయి. 8 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. కొందరు నెటిజన్లు ఖరీదైన స్వీట్‌ను ప్రయత్నించాలని తహతహలాడుతుండగా.. మరికొందరు దీనికి బదులు బెల్లం తింటే హ్యాపీగా ఉంటుందని చమత్కరిస్తున్నారు. టేస్ట్ చేయడానికి ఒక మిఠాయి ఫ్రీగా ఇస్తారా అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ జోడిస్తున్నారు.

మాజీ విశ్వసుందరి మనసులో మాటలు..వైరాగ్యమా..? వేదాంతమా..!

బంగారం పూతతో వంటకాలు తయారు చేయడం కొత్తేం కాదు. దుబాయ్‌లోని స్కూపీ కేఫ్ బ్లాక్ డైమండ్ అనే ఓ ఐస్‌క్రీమ్‌ను 23 క్యారెట్ల తినదగిన బంగారపు పూతతో సర్వ్ చేస్తుంది. దీని ధర రూ. 60,000. దుబాయ్ లో 'ఓ'పావో' అనే వడ పావ్‌ను 22 క్యారెట్ల బంగారపు పూత పూసి రూ. 2,000కు విక్రయిస్తారు. టోక్యోలోని రొప్పోంగి జిల్లాలోని ఓక్ డోర్ స్టీక్‌హౌస్‌లో గోల్డెన్ బర్గర్‌తో పాటు గోల్డ్ డస్ట్ బన్స్‌ను రూ. 63,000కి విక్రయిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: New Delhi, Trending, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు