DELHI SCHOOL TEACHER SHARES APOLOGY NOTE BY HER STUDENT GETS VIRAL IN THE INTERNET PVN
Viral Letter : ఓ విద్యార్థి టీచర్ కు సమర్పించిన అపాలజీ లెటర్ చూస్తే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు రావాల్సిందే
టీచర్ కు విద్యార్థి లెటర్
Student Appology Letter Viral : వైరల్ వీడియోలు మనకు కొత్తేమీ కాదు. రోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చుతాయి. కొన్ని సరదాగా ఉంటే... మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అయితే తాజాగా ఓ విద్యార్థి ..టీచర్ కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Student Appology Letter Viral : వైరల్ వీడియోలు మనకు కొత్తేమీ కాదు. రోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనకు బాగా నచ్చుతాయి. కొన్ని సరదాగా ఉంటే... మరికొన్ని ఆలోచింపజేస్తాయి. అయితే తాజాగా ఓ విద్యార్థి ..టీచర్ కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ లేఖ కోట్ల మందిని ఆలోచింజేసేలా ఉందంటూ దీనిని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు?అతడు టీచర్ కు రాసిన లేఖలో ఏముంది?అంతలా కోట్ల మందిని ఆలోచింపజేసేలా ఏముందబ్బా అని అనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఢిల్లీకి చెందిన మను గులాటీ అనే ఓ గవర్నమెంట్ టీచర్...విద్యార్థులకు ఓ అసైన్ మెంట్ ఇచ్చారు. " లెటర్ ఆఫ్ అపాలజీ" పేరుతో విద్యార్థులకు టీచర్ అసైన్మెంట్ ఇచ్చారు. దీని ప్రకారం విద్యార్థులు తమ ఊహలో ఎవరికైనా క్షమాపణ లేఖ రాసి ఉపాధ్యాయుడికి సమర్పించాలి. ఈ అసైన్మెంట్ లో భాగంగా ఓ విద్యార్థి...ఆర్మీ సైనికుడు తన డ్యూటీ కారణంగా తన సోదరి వివాహానికి హాజరుకాలేకపోయిన కారణాన్ని లేఖలో పేర్కొన్నాడు. తన సోదరికి, తల్లికి క్షమాపణ లేఖ రాస్తున్నట్లు ఊహించుకుని టీచర్ ఇచ్చిన అసైన్ మెంట్ చేశాడు.
అందులో విద్యార్థి... 'మన సరిహద్దు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అందుకే పెళ్లికి రాలేకపోయాను. నన్ను క్షమించండి. సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల కారణంగా నాకు సెలవు లభించలేదు. అక్క పెళ్లి చూడలేకపోయాను. అక్కను మళ్లీ ఎప్పుడు చూస్తానో తెలియదు. ప్రస్తుతానికి నా కర్తవ్యమే నాకు చాలా ముఖ్యం. రానందుకు నన్ను క్షమించండి" అని రాశాడు. విద్యార్థి రాసిన లేఖ టీచర్ ని కదిలించింది. ఈ లెటర్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఉపాధ్యాయుడు మను. దీంతో ఈ లెటర్ కాస్తా వైరల్ గా మారింది. ఈ లేఖ కోట్ల మందిని ఆలోచింజేసేదిగా ఉన్నదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తు్నారు. మరికొందరైతే జవాన్లు గ్రేట్..మన కోసం ప్రాణాలకు కూడా తెగించి మరీ పోరాడతారు అంటూ ఉద్వేగభరితమై కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మను మాట్లాడుతూ..విద్యార్థులను చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో నిరంతరం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా,ఇటీవల, ఇదే పాఠశాల విద్యార్థిలో ఒకరు హర్యాన్వీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్గా మారింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.