కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకుని దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దీనిలో భాగంగానే.. ఇప్పటికే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు మీద ప్రతిష్ఠించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అదే విధంగా.. ప్రధాని మోదీ ఆగస్టు 15 న తేదీన చేసిన ప్రసంగంలో వలసవాదులు ఏర్పాటు చేసి వెళ్లిన అనేక చిహ్నాలను, మార్పులు చేస్తామని అన్నారు. దీనిలో భాగంగానే ఎర్రకోట సమీపంలోని రాజ్ పథ్ ను, కర్తవ్యపథ్ గా పేరు మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనివెనుక ఉన్న కారణాన్ని మోదీ స్పష్టంగా తెలిపారు. దీనిపై చర్చించేందుకు సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సమాచారం.
నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం రోడ్డు, ప్రాంతాన్ని కర్తవ్య మార్గంగా పిలుస్తామన్నారు. బ్రిటిష్ వలస పాలకులు, పాలకుల శకం ముగిసిపోయిందని మోదీ అన్నారు. ఇంతకుముందు, మోడీ ప్రభుత్వం నామకరణాన్ని ఎక్కువ మంది వ్యక్తులను కేంద్రీకరించడానికి ఉద్దేశించిన సిద్ధాంతం ప్రకారం, ప్రధానమంత్రి నివాసం ఉన్న రహాదారి పేరు కూడా రేస్ కోర్స్ రోడ్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చబడింది.
ఇదిలా ఉండగా దేశంలో కరోనా మహామ్మారి తగ్గుముఖం పట్టింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 5910 కరోనా వైరస్ కేసులు,16 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,62,445కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,007 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 7,034 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,38,80,464కి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 53,974 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ 2.60 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక,దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో ఆదివారం 32,31,895 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 213.52 కోట్లకు చేరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.