DELHI HEAD CONSTABLE PRESENTS HELMETS AT WEDDINGS IN BIHAR VIDEO GOES VIRAL SNR
Bihar: నూతన వధువరులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన గెస్ట్ .. వైరల్ అవుతున్న వీడియో ఇదే
(Photo Credit:Youtube)
Video Viral: కొన్ని పెళ్లిళ్లలో వింతలు జరుగుతూ ఉంటాయి. మరికొన్ని వివాహాలే విచిత్రంగా అనిపిస్తుంటాయి. బీహార్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. పెళ్లి చూసేందుకు వచ్చిన పోలీసులు వధువరులకు కొత్త హెల్మెట్స్ బహుకరించారు. ఇలా చేయడానికి వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది.
బీహార్ (Bihar)రాష్ట్రం సరన్(Saran)జిల్లాలోని రసూల్పూర్(Rasulpur)పోలీస్ స్టేషన్ పరిధిలోని జమన్పురా(Jamanpura)గ్రామానికి చెందిన బలిరామ్ దూబే(Baliram Dubey)కుమార్తె వివాహం జరిగింది. ఆ పెళ్లి వేడుక సంగతి పక్కన పెడితే అక్కడికి అతిధులుగా వచ్చిన కొందరు పోలీసులు వధువరులకు ఇచ్చిన కానుకలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. కోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌక్రా గ్రామానికి చెందిన దయానాథ్ మిశ్రా(Dayanath Mishra)కుమారుడు వికాస్ మిశ్రా(Vikas Mishra)కు జమన్పురా గ్రామానికి చెందిన బలిరామ్ దూబే కుమార్తె బేబీ(Baby)తో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లి తంతు అంతా ముగిసిన తర్వాత పెళ్లి మండపంలోకి 21మంది పోలీసులు వచ్చారు. ప్రతి ఒక్కరూ బైక్‌లు నడుపుకొని హెల్మెట్స్ పెట్టుకొని ర్యాలీగా వచ్చారు. ఈ 21మంది పోలీసులను వెంటపెట్టుకొచ్చిన ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సందీప్ షాహి వధూవరులకు హెల్మెట్స్‌ని బహుమతిగా అందజేశారు. కొత్త జీవితంలో అడుగుపెడుతున్న వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.
పోలీసుల విజ్ఞప్తి ..
పోలీసు బృందానికి నాయకత్వం వహించిన సందీప్ షాహి అనే హెడ్ కానిస్టేబుల్ని ఢిల్లీలో హెల్మెట్‌మ్యాన్ అని పిలుస్తారు. ఢిల్లీలోనే కాదు వేర్వేరు రాష్ట్రాల్లో వాహనదారుల భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిస్తూ హెల్మెట్ ప్రాధాన్యతను ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైన్పూర్-రసూల్పూర్ రోడ్డు యాక్సిడెంట్లో వధువు బేబీ పెద్దనాన్న మెహగు దూబే మృతి చెందాడు. ఆ సమయంలో పెద్దనాన్నను కోల్పోయిన వధువు బేబీ తమ పెళ్లి వేడుకలకు హెల్మెట్స్‌తో స్వాగతం పలకాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సందీప్ షాహి స్ఫూర్తితో తాము ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు నూతన వధువరులు వికాస్, బేబీ.
వినూత్న ఆలోచన..
బీహార్‌లో కానిస్టేబుల్ కూతురు పెళ్లికి అతిధులుగా వచ్చిన ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ సందీప్ షాహి బృందం ఇక్కడే కాదు ఎక్కడ తమ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఇళ్లలో శుభకార్యాలు జరుగుతుంటే అక్కడకు వెళ్లి హెల్మెట్స్ బహుమతిగా అందజేయడం, బైక్‌ని జాగ్రత్తగా నడపాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. గత నెల 28వ తేదిన జిల్లాకు చెందిన మరో ఆడపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్లి 51మందికి హెల్మెట్స్ పంపిణి చేశారు ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ సందీప్ షాహి బృందం.
వీడియో వైరల్..
కొన్ని పెళ్లిళ్లలో వింతలు జరుగుతూ ఉంటాయి. మరికొన్ని వివాహాలే విచిత్రంగా అనిపిస్తుంటాయి. బీహార్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.