Home /News /trending /

DELHI GOVERNMENT TO ASK E COMMERCE FOOD AND CAB AGGREGATORS TO FULLY SWITCH TO ELECTRIC VEHICLES GH VB

Government: ఈ-కామర్స్, ఫుడ్, క్యాబ్ అగ్రిగేటర్లు EVలకు మారాలి.. త్వరలో ప్రభుత్వం ఆదేశాలు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కీలక చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ-కామర్స్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ సేవలు, క్యాబ్ అగ్రిగేటర్ల వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలలో భర్తీ చేయాలని కోరనుంది.

ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కీలక చర్యలు చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ-కామర్స్ కంపెనీలు, ఫుడ్ డెలివరీ సేవలు, క్యాబ్ అగ్రిగేటర్ల వాహనాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలలో భర్తీ చేయాలని కోరనుంది. పొల్యూషన్-అండర్-చెక్ (PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు ఫ్యూయెల్ ఇవ్వకూడదని పెట్రోల్ బంక్‌లను కోరనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో నమోదవుతున్న వాయు కాలుష్యంలో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాల వాటా 38 శాతంగా ఉన్నట్లు అంచనా. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు తాజా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు

"వాహన కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి ప్రభుత్వం రెండు ప్రధాన చర్యలు తీసుకోబోతోంది. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్ల సేవలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చమని అడుగుతాం. ఈ సేవలు దేశంలో నమోదైన వాహనాల్లో 30 శాతం ఉన్నాయి. పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేయవద్దని డీలర్లు, పెట్రోల్ పంపులను ఆదేశించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం’’ అని ఓ అధికారి పీటీఐకి తెలిపారు.

Ashes Test Series: యాషెస్ టెస్ట్​ సిరీస్​లో కరోనా కలకలం.. వారిలో నలుగురికి కరోనా పాజిటివ్..​ టెస్ట్ కొనసాగేనా..?


ఈ వారంలోనే నోటిఫికేషన్
పర్యావరణ (రక్షణ) చట్టం కింద ఢిల్లీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉంది. ఈవీలకు మారేందుకు అగ్రిగేటర్లకు గడువు ఇచ్చే అంశంపై మాత్రం స్పష్టత లేదు. దీనిపై ఢిల్లీ రవాణా శాఖలోని ఒక సీనియర్ అధికారిని సంప్రదించగా, ఈ నిర్ణయాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి ముసాయిదా మార్గదర్శకాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని అక్కడి ప్రభుత్వం 2020 ఆగస్టులో ప్రవేశపెట్టింది. 2024 నాటికి మొత్తం వాహన విక్రయాలలో EVల వాటాను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అక్టోబర్‌లో ఢిల్లీ నగరంలో PUC సర్టిఫికేట్‌లను తనిఖీ చేయడానికి ప్రభుత్వం భారీ డ్రైవ్‌ను ప్రారంభించింది. దీని కోసం పెట్రోల్ పంపుల వద్ద సుమారు 500 బృందాలను మోహరించింది. మోటారు వాహన చట్టం- 1993లోని సెక్షన్ 190(2) ప్రకారం, సరైన PUC లేని వాహన యజమానులకు అధికారులు రూ. 10,000 వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..


పొల్యూషన్ టెస్ట్ కీలకం
కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలకు సంబంధించిన ఉద్గార ప్రమాణాలను వాహనాలు కలిగి ఉండాలనే నిబంధన ఉంది. పొల్యూషన్ టెస్ట్‌లో ఈ వివరాలు బయటపడతాయి. అందుకే ప్రతి వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ప్రజల అవసరాల కోసం నగరంలో పెట్రోల్ పంపులు, వర్క్‌షాప్‌ల వద్ద దాదాపు 1,000 ఆథరైజ్డ్ పొల్యూషన్ చెకింగ్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా, జనవరి 1, 2022 నాటికి 10 సంవత్సరాలు నిండిన అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇతర ప్రదేశాలలో తిరిగి ఈ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) సైతం జారీ చేస్తుంది. అయితే ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, దరఖాస్తు చేసిన తేదీకి 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు నిండిన డీజిల్ వాహనాలకు ఎటువంటి NOCని ప్రభుత్వం జారీ చేయట్లేదు.

స్విస్ ఎయిర్ టెక్నాలజీ కంపెనీ IQAir ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా ఢిల్లీ నిలిచింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ 2018లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఢిల్లీలో 40 శాతం PM 2.5 ఉద్గారాలకు వాహనాలే కారణం. అందువల్ల వాహన ఉద్గారాల కట్టడిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Electric vehicle, Food

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు