హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Delhi Gangsters Enjoying: సేమ్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా లాగానే.. ఢిల్లీలోని ఓ లాకప్ లో గ్యాంగ్ స్టర్లు ఏం చేశారంటే..

Delhi Gangsters Enjoying: సేమ్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమా లాగానే.. ఢిల్లీలోని ఓ లాకప్ లో గ్యాంగ్ స్టర్లు ఏం చేశారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీకి చెందిన గ్యాంగ్ స్టర్లు లాక్ అప్ లై జల్సా సినిమా సీన్లను రిపీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా చూడండి.

  పవన్ కల్యాణ్(Pawan kalyan) హీరోగా నటించిన జల్సా సినిమాను(Jalsa Movie) చూసి ఉంటారుగా.. ఆ సినిమాలో విలన్ జైలు నుంచే సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ ఉంటాడు. అక్కడి నుంచే ఫోన్లో వార్నింగ్ లు కూడా ఇస్తూ ఉంటాడు. ఆ సీన్ ప్రారంభంలో అది జైలు అని కూడా మనకు అనిపించదు. కోర్టు నుంచి జైలుకు వెళ్లే దారిలో మర్డర్లు కూడా చేసి వస్తాడు ఆ విలన్. అయితే సినిమాలో ఈ సీన్ బాగున్నా కూడా.. నిజంగా మాత్రం ఇలాంటివి జరుగుతాయా? అని అంతా అనుకుంటూ ఉంటాం. అయితే తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. కాకపోతే అక్కడ జైలు.. ఈ వీడియో మాత్రం లాకప్. నలుగురు వ్యక్తులు లాకప్ లో హ్యాపీగా కుర్చొని.. మద్యం, అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్ చేతిలో సిగరెట్టుతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. మరొకరు సరదాగా ఫోన్ మాట్లాడుతూ ఉండడం కూడా ఆ వీడియోలోనే ఉంది. ఈ వీడియోని జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్ నీరజ్ పోస్ట్ చేయడం మరో ట్విస్ట్. ఆ వీడియోల్లో ఉన్నది నీరజ్ సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం ఇక్కడ ఇంకో ట్విస్ట్ గా చెప్పొచ్చు.

  అయితే.. ఇప్పటికే వీరిద్దరు జైలులో ఉండగా.. ఆగస్టు ఐదున మరో కేసులో పోలీసులు వీరిని రీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన ఖాకీలు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. వీళ్లను రీ అరెస్టు చేసింది కూడా జైలులో నుంచి బయట ఉన్న వారికి బెదిరింపులకు గురి చేసిన అభియోగాల మీద కావడం గమనార్హం.

  Honey Trap: ఫోన్లో మహిళల వలపు వల.., ఇంటికి పిలిపించి ఏకాంతంగా ఉన్న సమయంలో...

  అమ్మాయిలతో నగ్నంగా నిలబెట్టించే గ్యాంగ్. బాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్!


  ఎదుట సెల్ లో మరి కొందరు ఖైదీలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఈ వీడియోలో ఇంత క్లీయర్ గా కనిపిస్తున్నా.. పోలీసుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. లాకప్ లో మద్యం అందించబడదని ఈ వీడియోపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. కానీ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లు ఫన్నీ కామెంట్లో, ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. అధికారుల పనితీరుకు ఇది నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వ్యక్తులను కూడా ఇలానే వదిలేస్తారా? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Delhi, Delhi police, Viral Video, Viral Videos

  ఉత్తమ కథలు