హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking: మామను కాలర్ పట్టుకుని చావబాదిన లేడీ పోలీసు.. షాకింగ్ వీడియో వైరల్..

Shocking: మామను కాలర్ పట్టుకుని చావబాదిన లేడీ పోలీసు.. షాకింగ్ వీడియో వైరల్..

మామను కొడుతున్న లేడీ పోలీసు

మామను కొడుతున్న లేడీ పోలీసు

Delhi: లేడీ పోలీసు అత్తమామలతో వాగ్వాదానికి దిగింది. ఇంట్లోకి వెళ్లి నానా హాంగామా చేసింది. అడ్డుకోబోయిన పోలీసులు ముందే మామ, అత్త మీద చేయిచేసుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

కొన్నిసార్లు పెళ్లి (Marriage) తర్వాత భర్త, అత్తమామలతో ఏదైన మనస్పర్థలు సంభవిస్తాయి. అమ్మాయిలు పెరిగిన వాతావరణం, పరిస్థితులు కంప్లీట్ గా వేరుగా ఉంటాయి. పుట్టింట్లో అమ్మాయిలను ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. కానీ పెళ్లిచేసుకుని కోడలుగా వచ్చిన అత్తగారింట్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అప్పటి వరకు లేని.. కొన్ని బాధ్యతలు, కొంత ఆచీతూచీ ప్రవర్తించాల్సి ఉంటుంది. కొందరు దీన్ని పాటిస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం.. పుట్టింట్లో ఉన్నట్లే అత్తింట్లో కూడా తమదే నడవాలని, ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు.

దీంతో కొత్తగా వచ్చిన కోడలుకు, భర్త తరపు వారిమధ్య మనస్పర్థలు (Family disputes) ఏర్పడతాయి. అయితే.. దీన్ని మనం ఇంట్లోనే కూర్చుని మాట్లాడుకుని పరిష్కంచుకోవాలి. కానీ దీనికి భిన్నంగా మరికొందరు.. మాత్రం పది మందిలో పంచాయతీలు, పోలీసులంటూ తమ కాపురాన్ని బజారుకు ఈడ్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఘటన వెలుగులోనికి వచ్చింది.


పూర్తి వివరాలు.. న్యూఢిల్లీలో (Delhi) అమానుష ఘటన సంభవించింది. ఒక లేడీ పోలీసుకు, ఆమె అత్తమామలకు మధ్య ప్రాపర్టీ విషయంలో గొడవ జరిగింది. ఇప్పటికే ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో.. లేడీ పోలీసు, అత్తమామలు ఉంటున్న లక్ష్మీనగర్‌లోని ఇంటికి వచ్చింది. అక్కడ వీరికి మాటమాట పెరిగింది.

అక్కడ.. లేడీ పోలీసు రెచ్చిపోయింది. అత్తమామలను నోటికొచ్చినట్లు తిడుతూ.. భౌతికంగా దాడి చేస్తూ పిడిగుద్దులు కురిపించింది.

అక్కడున్న వారు.. ఆపడానికి ఎంత ట్రై చేసిన ఆమె ఎంత మాత్రం వినడం లేదు. పెద్దవాళ్లలను పదే పదే కొట్టింది. ఈ ఘటన గత ఆదివారం జరిగింది. ఈ గొడవ అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది సోషల్ మీడియాలో(Social media)  వైరల్ గా (Viral video) మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. లేడీ పోలీసుపై డిపార్ట్ మెంటల్ విచారణకు ఆదేశించారు.

ఇదిలా ఉండగా డాక్టర్ క్యాబిన్ లో రోగికి హార్ట్ ఎటాక్ వచ్చింది.

మహారాష్ట్రలోని (Maharashtra)  కొల్హాపూర్ లో ఊహించని ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ అర్జున్ అడ్నాయక్ దగ్గరకు గుండె సంబంధిత రిపోర్టులను చూయించడానికి పెషెంట్ లు వచ్చారు. ఈ క్రమంలో ఆయన రిపోర్టులను చూస్తున్నారు. ఇంతలోనే షాకింగ్ ఘటన జరిగింది. డాక్టర్ ముందే పెషెంట్ కు స్ట్రోక్ వచ్చింది. దీంతో అతని నోటి నుంచి మాటలు రాలేదు. శరీరమంతా చల్లబడిపోయింది. వెంటనే డాక్టర్ లేచి.. బాధితుడిని సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రెససిటేషన్) చేశారు. ఈ క్రమంలో.. వెంటనే బాధితుడి గుండెకు పలుమార్లు కొడుతూ, ఆయనకు వైద్యం అందించారు.

కొంత సేపటికి బాధితుడి తిరిగి మాములు స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనికి మెరుగైన వైద్యం అందించారు. కళ్ల ముందే .. బాధతో విలవిల్లాడిపోతున్న బాధితుడిని, వెంటనే స్పందించి ట్రీట్ మెంట్ చేసిన ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral video) మారింది. దీన్ని రాజ్యసభ ఎంపీ ధనంజయ్ మహదిక్ సహా.. పలువురు యూజర్లు హ్యాట్సాఫ్ అంటూ.. కామెంట్ లు పెడుతూ.. తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Delhi, Family dispute, Viral Video

ఉత్తమ కథలు