DELHI COP ATTACKED BY BULL WHILE ON DUTY GOES VIRAL PAH
Shocking: గాలిలో బంతిలాగ ఎగిరిన కానిస్టేబుల్.. కారణం ఏంటంటే..
కానిస్టేబుల్ పై ఎద్దు దాడి
Viral video: ఒక ఎద్దు నడిరోడ్డుపై బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డుపై డ్యూటీ చేస్తున్న పోలీసును వెనుక నుంచి దాడి చేసింది. ఈ క్రమంలో అతను గాలిలో ఎగిరి కింద పడ్డాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Delhi Cop Attacked By Bull: రోడ్డుపై ఒక పోలీసు ట్రాఫిల్ విధులు నిర్వహిస్తున్నాడు. వాహానాలు రాంగ్ రూట్ లో వెళ్ళకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధికరిస్తున్నాడు. సిగ్నల్ ను జంప్ చేస్తున్న వారి వాహానాల ఫోటోలను తన సెల్ ఫోన్ లో బంధిస్తున్నాడు. ఈ క్రమంలో.. రోడ్డుకి ఒక వైపు నిలబడ్డాడు. అప్పుడు ఒక ఎద్దు రోడ్డుపైన నడుచుకుంటు వెళ్తుంది. దానికి ఎదురుగా పోలీసు కనిపించాడు. పాపం.. అతను వెనుక ఎద్దును గమనించలేదు.
ఎద్దుకు ఎమనిపించిందో ఏమో గానీ.. ఒక్కసారిగా అతడిని కుమ్మింది. దీంతో అతను గాల్లో బంతిలాగ ఎగిరాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో ఫన్నీ, వెరైటీ కంటెంట్ ను చూడటానికి నెటిజన్లు ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు.
ఇక జంతువులకు సంబంధించి ప్రధానంగా కుక్కలు, పిల్లులు, గున్న ఏనుగులు చేసే చిలిపి చేష్టలతో వీటి వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు.. జంతువుల కంటెంట్ చూడటానికి సైతం నెటిజన్లు ఇష్టపడతారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు.. ఈ ఘటన న్యూఢిల్లీలోని దయాల్ పూర్ లో జరిగింది. స్థానింగా ఉన్న షేర్ పూర్ చౌరస్తా వద్ద జ్ఞాన్సింగ్ అనే కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో .. అతను వాహానాలను రాంగ్ రూట్ లో వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించిన వారి ఫోటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో అతను.. రోడ్డుపై గత గురువారం విధులు నిర్వహిస్తున్నాడు. అప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. సాధారణంగా ఎద్దు ఎరుపు రంగుని ఇష్టపడదని భావిస్తుంటారు. ఆ రంగు దుస్తులు వేసుకున్న వారిని దాడిచేసిన ఘటనలు మనం సినిమాల్లో చూశాం. కానీ ఇక్కడో ఎద్దుకి ఖాకీ రంగంటే నచ్చలేదో ఏమో కానీ, ఆ రంగు దుస్తులు వేసుకున్న కానిస్టేబుల్ ను వెనక నుంచి దాడిచేసింది.
ఒక ఎద్దు రోడ్డుపైకి నడుచుకుంటు వెళ్తుంది. అది.. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను చూసింది. ఏమైందో .. ఏమో .. కానీ వేగంగా వచ్చి వెనుక కుమ్మింది. దీంతో అతను ఒక్కసారిగా గాల్లో ఎగిరి కింద పడ్డాడు. అక్కడున్న వారంతా.. షాక్ తో ఎద్దును చూస్తునే ఉండిపోయారు. చివరకు ధైర్యం చేసి.. అక్కడే ఉన్న మరోక కానిస్టేబుల్, స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ కు తలకు, నడుముకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను కొలుకుంటున్నాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.