టైట్ జీన్స్ వేసుకొని డ్రైవింగ్.. గుండె పోటుకు గురై..

టైట్ జీన్స్ వేసుకొని, దాదాపు 8 గంటల పాటు కదలకుండా డ్రైవింగ్ చేసిన ఓ డ్రైవర్‌ గుండె పోటుకు గురయ్యాడు.

news18-telugu
Updated: November 22, 2019, 8:27 PM IST
టైట్ జీన్స్ వేసుకొని డ్రైవింగ్.. గుండె పోటుకు గురై..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జీన్స్ వేసుకోవడం ఎంత డేంజరో మరోసారి రుజువైంది. టైట్ జీన్స్ వేసుకున్న ఓ వ్యక్తి దాదాపు 8 గంటల పాటు ఏకధాటిగా కారు డ్రైవింగ్ చేశాడు. దాంతో పల్స్ రేట్ పడిపోయి గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నగరంలోని పీతమ్‌పురాకు చెందిన సౌరభ్ శర్మ (30) టైట్ జీన్స్ ధరించి, తన కారులో ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయాణించాడు. ఢిల్లీ నుంచి రుషికేశ్‌కు వెళ్లారు. ఐదు గంటల తర్వాత అతడి కాలు పనిచేయకపోవడంతో కాస్త కదిలించాడు. అయితే.. తిరుగు ప్రయాణమై ఢిల్లీకి వచ్చాక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఓ ఆస్పత్రికి వెళ్లాక గుండె పోటు వచ్చిందని తేలింది. అతడు ఆస్పత్రికి వచ్చేసరికి పల్స్ రేటు నిముషానికి 10-12 మధ్య ఉందని డాక్టర్లు తెలిపారు. అతడు టైట్ జీన్స్‌లో ఏకధాటిగా 8 గంటలపాటు కదలకుండా ఉండటంతో గుండె పోటు వచ్చిందని వెల్లడించారు.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>