Home /News /trending /

DELHI BOUND SPICEJET FLIGHT WITH 185 PASSENGERS CATCHES FIRE MID AIR MAKES EMERGENCY LANDING AT PATNA AIRPORT PAH

SpiceJet: స్పైస్ జెట్ విమానంలో వ్యాపించిన మంటలు.. విమానంలో 185 ప్రయాణికులు..

అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం

అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం

Bihar: పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు పాట్నాలోనే విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

బీహర్ లోని (Bihar)  పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన స్పైస్ జెట్ (SpiceJet Flight) విమానంలో మంటలు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన ఆదివారం విమానం గాల్లో ఉండగానే జరిగింది. దీంతో అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఢిల్లీకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం SG 723 ఇంజిన్‌లో కొన్ని సమస్యల కారణంగా ఆదివారం గాలిలో మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు సకాలంలో స్పందిచడం వలన (Emergency Landing) పెను ప్రమాదం తప్పింది. 185 మంది ప్రయాణికులతో ఉన్న విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయానికి తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ఎటువంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ విమానం పాట్నాలోని జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో విమానం ఎగిరిన కొద్ది సేపటికే, స్థానికులు మంటలు అంటుకున్నట్లు అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పైస్ జెట్ అధికారులు ఎమర్జెన్సీగా విమానాన్ని పాట్నాలో (Patna Airport) ల్యాండ్ చేశారు. ఇక మరోక విమానంలో ప్రయాణికులను పాట్నా నుంచి ఢిల్లీకి చేరవేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.





గతంలోనే ఢిల్లీ అగ్నిప్రమాద (Delhi Fire Accident) ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో మ‌ృతుల సంఖ్య భారీగా నమోదయ్యింది. మంటలు చల్లారిన తర్వాత ఆ భవనంలో రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడో అంతస్తులో కొన్ని చోట్ల మాంసపు ముద్దలు కనిపించాయని..  అవి మానవ మృతదేహాలవేనని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఎన్ని శవాలున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. ముక్కలముక్కలవడంతో.. లెక్కించడం కష్టంగా మారింది. అర్ధరాత్రి వరకు 27 మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మూడో అంతస్తులో మరికొన్ని  మానవ అవయవాలు లభించడంతో.. మరో ముగ్గురు (Delhi Fire Mishap) మరణించిన ఉండొచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 30 మంది మరణించినట్లుగా భావించవచ్చని పేర్కొన్నారు.



ఈ ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాద సమయంలో ఓ గదిలో మీటింగ్ జరిగిందని.. 50 మంది వరకు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ గదిలోనే ఎక్కువ శవాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Fire Accident, Flight, Patna

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు