హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

‘ముందు వెళ్లి బ్లౌజ్ వేసుకురా.. ’.. ఆస్ట్రాలజర్ పై ఘాటుగా కామెంట్ లు పెడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

‘ముందు వెళ్లి బ్లౌజ్ వేసుకురా.. ’.. ఆస్ట్రాలజర్ పై ఘాటుగా కామెంట్ లు పెడుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

నిధి చౌదరీ లేడీ ఆస్ట్రాలజర్

నిధి చౌదరీ లేడీ ఆస్ట్రాలజర్

Delhi astrologer: యూట్యూబర్ శనిదేవుడి ప్రభావం గురించి లైవ్ లో నెటిజన్లకు పరిహారాలు చెబుతుంది. ఆమె చీరను ధరించింది. కానీ ఆమె బ్లౌస్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi)  ఒక జ్యోతిష్యురాలు ట్రోలింగ్ బారిన పడింది. ఆమెతన యూట్యూబ్ లో, శనిదేవుడి ప్రభావం, పరిహారాల గురించి చెబుతుంది. అయితే.. ఆమె చీరకట్టులో అందంగా ముస్తాబై, క్యామెరా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. కానీ ఆమె జాకెట్ విషయంలో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రవర్షీ నడుస్తోంది.

అసలేం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన యూట్యూబర్, జ్యోతిష్యురాలు నిధి చౌదరి (Nidhi chaudhary)  చాలా ఫెమస్. ఆమెకు సోషల్ మీడియాలో 14.1 కే మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. ఈరోజు ఆమె జాకెట్ మీద రచ్చ నడుస్తోంది. ఇటీవల ఆమె ఒక వీడియోను సోషల్ మీడియాలో  (Social media) అప్ లోడ్ చేశారు.

దానిలో ఆమె శనిదేవుడి ప్రభావం, పరిహారాల గురించి వివరిస్తున్నారు. అయితే.. దానిలో ఆమె మన ఆఫీస్ లో, ఇంట్లో పనివారిని పీడించవద్దని అన్నారు. వారు ఎంతగా కష్టపడతారో.. అంత డబ్బులు వారికి ఇచ్చేయండని ఆమె చెప్పారు. బీదవాళ్లకు ఎంతగా సాహాయం చేస్తే అంత మంచి జరుగుతుందని అన్నారు. ఈ వీడియోలో ఆమె జాకెట్ ధరించి ఉన్నట్లు కన్పించడం లేదు. కేవలం చీర మాత్రమే ధరించి ఉన్నారు. అంతేకాకుండా.. ఆమెచేతికి కొన్ని రంగు రంగు దారాలు వేసుకున్నారు.

ఈ వీడియోను వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ముందు వెళ్లి బ్లౌజ్ వేసుకురా.. ’..,‘లైవ్ లో జాకెట్ వేసుకోకుండా ఏంటీ నీ జ్యోతిష్యం..?’.. అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు ఆమెకు జాకెట్ కొనుక్కొమని డబ్బులు విరాళాలుగా పంపుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది.

ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో (Delhi) మరో పెంపుడు శునకం లిఫ్ట్ లో (Pet Dog) ఉన్న బాలుడిని కరిచిన సంఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (viral)  మారింది.

ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 75 లోని అపెక్స్ ఎథీనా సొసైటీలో సంభవించింది. కాగా, ఒక బాలుడు బయటకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కాడు. కానీ అందులో అప్పటికే ఒక వ్యక్తి, తన పెంపుడు శునకం జర్మన్ షిఫార్డ్ తో ఉన్నాడు. కుక్కను తాడుతో కట్టి, దాన్ని కంట్రోల్ చేయడానికి కర్రను కూడా పట్టుకున్నాడు.

ఆ తర్వాత.. యువకుడు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చింది. అతను కుక్కను ముందుకు పోనిచ్చాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. కుక్క అమాంతం ఎగిరి బాలుడిపై దాడిచేసింది. అతడిని కోరికింది. వెంటనే దానిన యజమాని గట్టిగా వెనక్కు లాగాడు. కానీ అప్పటికే బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం దీనిపై స్థానికంగా రచ్చ జరుగుతుంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Astrology, Delhi, Horoscope, Viral Video

ఉత్తమ కథలు