హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మరో ఘటన.. లిఫ్ట్ లో బాలుడిని కరిచిన పెంపుడు శునకం.. ఎక్కడంటే..

మరో ఘటన.. లిఫ్ట్ లో బాలుడిని కరిచిన పెంపుడు శునకం.. ఎక్కడంటే..

దాడి చేస్తున్న పెంపుడు శునకం

దాడి చేస్తున్న పెంపుడు శునకం

Delhi: బాలుడు బయటకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కాడు. అప్పటికే లోపల ఒక వ్యక్తి తన పెంపుడు శునకం జర్మన్ షెఫార్డ్ తో నిలబడ్డాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

మనలో చాలా మంది కుక్కలు పెంచుకొవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. మంచి ఫుడ్, వాకింగ్ లకు తీసుకెళ్తుంటారు. అయితే.. చాలా వరకు కుక్కలు తమ యజమానుల అదుపులోనే ఉంటాయి. కొత్త వారిని చూస్తే అరుస్తాయి. కానీ కొన్నిసార్లు మాత్రం అవి ఇతరులపై దాడి కూడా చేస్తాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. న్యూఢిల్లీలో (Delhi) మరో పెంపుడు శునకం లిఫ్ట్ లో (Pet Dog) ఉన్న బాలుడిని కరిచిన సంఘటన సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (viral)  మారింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 75 లోని అపెక్స్ ఎథీనా సొసైటీలో సంభవించింది. కాగా, ఒక బాలుడు బయటకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కాడు. కానీ అందులో అప్పటికే ఒక వ్యక్తి, తన పెంపుడు శునకం జర్మన్ షిఫార్డ్ తో ఉన్నాడు. కుక్కను తాడుతో కట్టి, దాన్ని కంట్రోల్ చేయడానికి కర్రను కూడా పట్టుకున్నాడు. ఆ తర్వాత.. యువకుడు వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చింది. అతను కుక్కను ముందుకు పోనిచ్చాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.


కుక్క అమాంతం ఎగిరి బాలుడిపై దాడిచేసింది. అతడిని కోరికింది. వెంటనే దానిన యజమాని గట్టిగా వెనక్కు లాగాడు. కానీ అప్పటికే బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం దీనిపై స్థానికంగా రచ్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో హౌసింగ్ సొసైటీ ఎలివేటర్ లోపల పెంపుడు కుక్క బాలుడిని క్రూరంగా (Pet Dog attack) కరిచిన వీడియో ఆన్‌లైన్‌లో దుమారం రేపింది. ఈ ఘటనలో కుక్క యజమాని ఆవేదనకు వ్యతిరేకంగా ఇంటర్నెట్ వినియోగదారులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా పెంపుడు శునకాలు.. జనాలను కరవడం పై నెటిజన్లు కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. తమ శునకాలను కంట్రోల్ లో పెట్టుకువాలని, దాని యజమానులకు సూచిస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Pet dog, Viral Video

ఉత్తమ కథలు