దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది కేజ్రీవాల్ సర్కార్. అయితే, లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందు బాబులకు ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. మద్యం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హోమ్ డెలివరీకి అనుమతిచ్చింది. ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్స్, మొబైల్ యాప్‌ల ద్వారా బుకింగ్స్ స్వీకరించి నేరుగా మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు మద్యం షాపులకు అనుమతిచ్చింది. వినియోగదారులు కేవలం భారతీయ బ్రాండ్లకు చెందిన మద్యమే కాకుండా విదేశీ మద్యాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ చట్టంలో కొన్ని సవరణలు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మద్యం షాపుల వద్ద గుమికూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. “కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు లిక్కర్ హోమ్ డెలివరీ అనుమతులు మంజూరు చేస్తున్నాం. ఎల్–13 లైసెన్స్ ఉన్న షాపులు మద్యాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చు. అయితే, వినియోగదారులు తమ ఆర్డర్లను ఖచ్చితంగా మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం హోమ్ డెలివరీ ఉండదు. ఎల్–13 లైసెన్స్ లేని లిక్కర్ షాపుల యాజమాన్యాలు మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతి లేదు.” అని పేర్కొంది. ఈ నిబంధనలను ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ (సవరణ)–2021 గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించింది.
సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్..
కాగా, లాక్డౌన్ కారణంగా దాదాపు నెల రోజుల నుంచి ఢిల్లీలో మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. దీంతో మందుబాబులు అల్లాడిపోయారు. ఎట్టకేలకు అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా మద్యం షాపులు, బార్లను తెరిచింది ప్రభుత్వం. అంతేకాదు, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మద్యం హోమ్ డెలివరీకి అనుమతించడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ఈ వార్తలను చూసి ఆనందిస్తూ, సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. డిల్లీ డ్రింకర్స్ పేరుతో వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ బాహుబలి సినిమాలో ఒక సీన్‌ను ఉద్దేశిస్తూ ‘‘ఇది నిజంగా పండగ చేసుకోవాల్సిన రోజు”అంటూ ట్విట్టల్‌లో మీమ్ షేర్ చేశాడు. ఇక, మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ ‘‘ఇది నాకు నిజంగా పెద్ద రిలీఫ్. ఈ రోజును ఎప్పుడూ మర్చిపోలేను.”అంటూ ట్వీట్ చేశాడు.
Delhi drinkers Right Now ?? https://t.co/nJTI4o4CFQ pic.twitter.com/TNeSvjybon
— Ashish Singh Mahi?? (@ashishsinghmahi) June 1, 2021
Delhiites right now https://t.co/AocyiXnnHN pic.twitter.com/bJ9mkJAIXO
— Chura liya hai tumne jo meme ko (@ChuraMeme) June 1, 2021
మరో నెటిజన్ కేవలం ఢిల్లీకేనా.. నోయిడాకు కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉందా? అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించాడు. ఏదేమైనప్పటికీ, లిక్కర్ హోమ్ డెలివరీతో మందుబాబులు తెగ సంబరపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Home delivery, Liquor, Noida