DEFENCE DIARY MANY LIKE PRADEEP WANT TO JOIN INDIAN ARMY RECRUITMENT MUST BEGIN BEFORE THEY RUN OUT OF STEAM DETAILS HERE GH VB
Army Recruitment: ఆర్మీ అలసత్వం.. ప్రదీప్ మెహ్రా లాంటి యువకులకు అన్యాయం..!
ప్రదీప్
సైన్యంలో చేరాలనే లక్ష్యంతో యంగ్‌స్టర్స్ ఎంతో కృషి చేస్తున్నప్పటికీ.. రిక్రూట్మెంట్ (Recruitment) విషయంలో ఇండియన్ ఆర్మీ చాలా అలసత్వం వహిస్తోంది. రిక్రూట్మెంట్స్ సస్పెండ్ చేస్తున్నందుకు యువకులు ఆందోళన చెందుతున్నారు.
సైన్యంలో చేరాలనే బలమైన కోరిక చాలామంది యంగ్‌స్టర్స్‌లో ఉంటుంది. మొన్నీమధ్య వైరల్ గా మారిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా (Pradeep Mehra) స్టోరీ మీరు వినే ఉంటారు. ఈ యువకుడు డ్యూటీ అయిపోయిన తర్వాత డైలీ అర్ధరాత్రి రోడ్లపై పరుగెత్తుతుంటాడు. అలా అతడు ఆర్మీ (Indian Army)లో జాయిన్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రదీప్ మెహ్రా ఒక్కడే కాదు దేశవ్యాప్తంగా చాలా మంది ఆర్మీలో జాయిన్ అవ్వాలనే తపనతో సెల్ఫ్-ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అయితే సైన్యంలో చేరాలనే లక్ష్యంతో యంగ్‌స్టర్స్ ఎంతో కృషి చేస్తున్నప్పటికీ.. రిక్రూట్మెంట్ (Recruitment) విషయంలో ఇండియన్ ఆర్మీ చాలా అలసత్వం వహిస్తోంది.
కోవిడ్-19 కారణంగా గత రెండేళ్లగా ఆర్మీ రిక్రూట్మెంట్లను ఇండియన్ ఆర్మీ వాయిదా వేస్తూ వస్తోంది. వాస్తవానికి జనరల్ డ్యూటీ సోల్జర్ పోస్ట్ (GD)కు సెలెక్ట్ అవ్వాలంటే అభ్యర్థుల వయసు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. ఆర్మీలో మిగతా కొన్ని పోస్టులకు వయోపరిమితి 23 ఏళ్లుగా ఉంది. అయితే ఏళ్లపాటు ఆర్మీ నియామకాలు వాయిదా వేస్తుండటంతో.. ఏజ్ దాటిపోయిన చాలామంది కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.
కరోనా కారణంగా గత రెండేళ్లుగా రిక్రూట్మెంట్ ప్రక్రియ నిలిపివేశామని కొద్ది రోజుల క్రితం డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు. 2020-21, 2021-22 మధ్యకాలంలో 199 మంది మహిళా అభ్యర్థులను కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ (CMP)లో నియమించడం కూడా ఆగిపోయిందని ఆయన తెలిపారు. ఇదే కాలంలో ఎన్నికల ర్యాలీలు జరిగాయి కానీ రిక్రూట్మెంట్ ర్యాలీలను ఇండియన్ ఆర్మీ నిలిపి వేయడం గమనార్హం. దీనివల్ల గత రెండేళ్లలో సైన్యంలో దాదాపు 80,000 మంది సైనికుల కొరత ఏర్పడింది. ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ కొరతను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నియామక విధానాన్ని రూపొందించాల్సిన అవసరముంది. లేదంటే ఆర్మీ ఆపరేషనల్ ఎఫిషియన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
I am working in McDonald's for almost a month. I'm practicing to get into Indian Army. I run for 10 kms every day... My mother is getting treatment in a hospital in Delhi. People are getting motivated seeing my video: Pradeep Mehra, whose sprinting video in Noida has gone viral pic.twitter.com/Zn3hW4kAbG
రిక్రూట్మెంట్ ప్రాసెస్
ఆర్మీలో రిక్రూట్మెంట్ అనేది జనరల్ డ్యూటీ (GD) సైనికుల కోసం ప్రతి రాష్ట్రంలోని రిక్రూట్ చేయదగిన పురుష జనాభా (RMP) ఆధారంగా జరుగుతుంది. అలాగే క్లర్క్‌లు, హౌస్కీపర్లు, చెఫ్‌లు, ఇతరులతో సహా బలగాల నియామక ప్రక్రియ వివిధ ట్రేడ్ల ఆధారంగా కొనసాగుతుంది. వివిధ రెజిమెంట్ల క్లాస్ కంపోజిషన్ ముందుగా నిర్ణయిస్తారు. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశాక... GD సైనికులకు 36 వారాలు, ట్రేడ్స్మెన్లకు 18-20 వారాల శిక్షణ వ్యవధిని అందిస్తారు.
పార్లమెంటుకు సమర్పించిన డేటా ప్రకారం, 2020-21లో 97 రిక్రూట్మెంట్ ర్యాలీలు ప్లాన్ చేశారు, వాటిలో 47 మాత్రమే కండక్ట్ చేయదగినవి. ఈ ర్యాలీలలో నాలుగు ర్యాలీలకు మాత్రమే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) జరిగింది. 2021-22లో 87 రిక్రూట్మెంట్ ర్యాలీలు ప్లాన్ చేయగా, వాటిలో కేవలం నాలుగు మాత్రమే నిర్వహించారు, కానీ CEE ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఆర్మీ 2018-19లో 53,431 మంది అభ్యర్థులను, 2019-20లో 80,572 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నట్లు డేటా చూపిస్తుంది. డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, జనవరి 1 నాటికి 81,000 మంది సిబ్బంది కొరత ఉందని ఆర్మీ తెలిపింది.
రిక్రూట్మెంట్ తక్షణమే ఎందుకు ప్రారంభించాలి?
రెండేళ్లపాటు ఎలాంటి రిక్రూట్మెంట్ జరగకపోవడంతో సైన్యంలో దాదాపు 80 వేల మంది సైనికుల కొరత ఏర్పడింది. ప్రతిఏటా దాదాపు 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చేస్తున్నారు. మరోపక్క వారిని భర్తీ చేసే సైన్యాన్ని నియమించడం లేదు ఇండియన్ ఆర్మీ. దీనివల్ల ప్రస్తుతం ఉన్న సైనికులపై పని భారం పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించినప్పటికీ, అభ్యర్థులను సైన్యంలోకి నియమించేనాటికి చాలా సమయం పడుతుంది. ఈ కారణంగా సైనికుల రిక్రూట్మెంట్పై మేజర్ పాలసీ చేంజ్ చేయక తప్పదని తెలుస్తోంది.
లేదా శిక్షణ వ్యవధిని తగ్గించడం, ఎక్కువ సంఖ్యలో సైనికులకు తాత్కాలికంగా వసతి కల్పించడానికి దాని మౌలిక సదుపాయాలను విస్తరించాలి. లేదంటే కొన్నేళ్ళపాటు ఆర్మీ రిటైర్మెంట్స్ స్టాప్ చేయాలి. అలానే సైన్యంలో చేరాలని ప్రిపేరవుతున్న యంగ్‌స్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని నియామకాలను పెద్ద ఎత్తున ఇండియన్ ఆర్మీ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.