Home /News /trending /

DEER ZINDAGI UP POLICE SHARES VIDEO OF PATIENT DEER WAITING TO CROSS STREET PROMOTES ROAD SAFETY PAH

Viral video: మనుషుల కన్న మూగ జీవాలే నయం.. వైరల్ అవుతున్న వీడియో..

రోడ్డు దాటుతున్న జింక

రోడ్డు దాటుతున్న జింక

Japan: ఒక జింక రోడ్డుపైకి వచ్చింది. అప్పుడు రోడ్డుపైన విపరీతమైన వాహనాల రద్దీ ఉంది. సిగ్నల్ పడే వరకు వేచిచూసి ఆతర్వాత రోడ్డు దాటింది.

మనలో చాలా మంది అస్సలూ ట్రాఫిక్ రూల్స్ పాటించరు. ప్రతి ఒక్కరికి తామే.. ముందు గమ్మస్థానాలకు వెళ్లాలని అనుకుంటారు. కొందరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ను బ్రేక్ చేసి మరీ వెళ్తుంటారు. ఇక మరికొంత మంది సిగ్నల్ పడితే.. జీబ్రా క్రాసింగ్ లైన్ మీదకు తమ వెహికిల్స్ ను తెచ్చి నిలబెడతారు. అది పాదచారులు రోడ్డుదాటి వెళ్లడానికి ఉంచారనే విషయం కూడా ఆలోచించరు. మరికొందరైతే.. జీబ్రా క్రాసింగ్ లో రోడ్డు దాటకుండా ఎలా పడితే... అలా రోడ్డు దాటుతుంటారు. దీంతో వాహనాలు వేగంగా వచ్చి.. ప్రమాదాలకు గురౌతుంటారు. అయితే, ఇక్కడ ఒక జింక సిగ్నల్ పడే వరకు వేచిచూసి ఆ తర్వాత.. జీబ్రాలైన్ మీద రోడ్డు దాటింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు ఈ వీడియోను తమ అధికారిక ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. రోడ్డు భద్రతను, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు దాటుతున్న జింక దీనిలో కనపడుతుంది. అయితే, ఇది డీర్ జిందగీ అంటూ టాగ్ చేశారు. నిజానికి ఈ ఘటన గతంలో.. సెంట్రల్ జపాన్‌లోని చోటు చేసుకుంది. నారా ప్రిఫెక్చర్‌ దీన్ని క్యాప్చర్ చేశారు. అక్కడ సికా జాతి జింకలను మచ్చిక చేసుకుంటారు. అవి బహిరంగా ప్రదేశాలలో కూడా స్వేచ్ఛగా విహరిస్తాయి. వాటికి ఎవరు కూడా హనితలపెట్టరు. చాలా మంది ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తు.. ప్రమాదాలకు కారణమవుతున్నారు.

దీంతో చాలా మంది తమ ప్రాణాలను కొల్పోతున్నారు. మూగ జీవి ఎంత జాగ్రత్తగా రోడ్డుపైన చేరి.. జాగ్రత్తగా రోడ్డుతుందని పేర్కొన్నారు. అందరు కూడా ట్రాఫిక్ నిబంధలను పాటిస్తే.. ప్రమాదాల తీవ్రత తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్.. మన కన్న నోరులేని జీవే నయం.., దాన్ని చూసి మనం ట్రాఫిక్ రూల్స్ పాటించడం నేర్చుకొవాలంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఒక శునకం ఫన్నీగా ప్రవర్తించింది.

ఒక అమ్మాయి తెలుపు రంగు టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు వేసుకుని ఇంటి ముందర కూర్చోని ఉంది. ఏదో విషయం గురించి డీప్ గా ఆలోచిస్తున్నట్టుంది. ఇంతలో ఆ వీధిలో కొన్ని శునకాలు వచ్చాయి. సాధారణంగా కుక్కలు ఆటోలు,కార్లు, గోడల మీద మూత్ర విసర్జన చేస్తుంటాయి. అయితే, ఈ శునకం మాత్రం కాస్త వింతగా ప్రవర్తించింది. అక్కడ దగ్గర్లో దానికి అనుకూలంగా ఏం కన్పించలేదో కానీ..మెల్లగా కింద కూర్చోని ఉన్న అమ్మాయి దగ్గరకు వెనక నుంచి వెళ్లింది.

యువతి కుక్కను గమనించలేదు. అది మెల్లగా వెళ్లి కాలు పైకెత్తి మూత్ర విసర్జన చేసింది. పాపం.. అమ్మాయికి ఏదో తడిగా అన్పిస్తే.. వెనుక వైపు చూసింది. ఆ తర్వాత.. షాక్ కు గురైంది. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు అమ్మాయిని కుక్క.. ఆ రకంగా బ్లేస్సింగ్స్ ఇచ్చిందంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Japan, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు