దీప్‌వీర్ పెళ్లి ఫోటోలపై సెటైర్లు... చూస్తే నవ్వు ఆపుకోలేరు...

దీపిక- రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోలపై ట్విట్టర్లో విపరీతమైన ట్రోలింగ్... క్రియేటివిటీతో కడుపుబ్బా నవ్విస్తున్న నెటిజన్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 16, 2018, 6:36 PM IST
దీప్‌వీర్ పెళ్లి ఫోటోలపై సెటైర్లు... చూస్తే నవ్వు ఆపుకోలేరు...
దీపిక- రణ్‌వీర్‌ల పెళ్లి ఫోటోలపై ట్విట్టర్లో విపరీతమైన ట్రోలింగ్... క్రియేటివిటీతో కడుపుబ్బా నవ్విస్తున్న నెటిజన్లు...
  • Share this:
బాలీవుడ్ హాట్ జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ ఇటలీలో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. అత్యంత విలాసవంతమైన విల్లాలో బోలెడంత ఖర్చుతో రెండు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరగనుంది. కేవలం రోజా పూల కోసమే 6 లక్షలు ఖర్చు చేస్తున్న ఈ బీటౌన్ జోడి... కేవలం 30 మంది ఆత్మీయ అతిథుల మధ్య ఒక్కటైంది. పెళ్లికి వచ్చేవారి దగ్గర్నుంచి కూడా మొబైల్ ఫోన్లు తీసుకోవడంతో ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. పెళ్లైన తర్వాత రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకునే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాకా... వారి పెళ్లికి సంబంధించిన క్లియర్ ఫోటోలు లభించలేదు.

వీరు కూడా మొక్కుబడిగా రెండు ఫోటోలను పోస్ట్ చేసి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దీపికా- రణ్‌వీర్ పెళ్లిఫోటోలు చూసిన తర్వాత ఇంటర్‌నెట్ ఇలా ఊగిపోతోందంటూ పోస్ట్ చేసిన వీడియో... నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.రణ్‌వీర్- దీపికాల పెళ్లిఫోటోలను చూసి రణబీర్ ‘చెన్నా మెరెయా’ పాట పాడుతున్నాడంటూ ఎడిట్ చేసిన పిక్ పోస్ట్ చేశాడో నెటిజన్...

ప్రతీఒక్కరూ వాళ్లు ఇటలీలో పెళ్లికి వెళ్లినట్టే దీపికా- రణ్‌వీర్ వివాహా ఫోటోలను పోస్ట్ చేస్తున్నారంటూ ఓ నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు.‘ఒప్పో వెడ్స్ వీవో’ అంటూ ఒకతను పోస్ట్ చేశాడు. ‘ఒప్పో’కి దీపికా పదుకొనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తుంటే, ‘వీవో’ మొబైల్స్‌కి రణ్‌వీర్ సింగ్ ప్రచారకర్తగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.
ఎక్కడ మొదలెట్టి... ఎక్కడి దాకా వచ్చారో అంటూ పాత, కొత్త ఫోటోలను ముడిపెడుతూ ఓ పోస్ట్ చేశాడు మరో నెటిజన్.ఒరిజనల్ ఫోటోల కంటే పెయింటింగ్ సరిగ్గా ఉందంటూ ఓ డ్రాయింగ్ పోస్ట్ చేశాడో ట్విట్టర్ ఖాతాదారుడు.


First published: November 16, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు