• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DEEP NOSTALGIA A NEW AI TOOL WHICH BRINGS OLD PHOTOS TO LIFE IN SMALL VIDEO PORTRAITS HERE IS THE INTERESTING DETAILS NK

Deep Nostalgia: పాత ఫొటోలకు ప్రాణం... ఆశ్చర్యపరుస్తున్న డీప్ నోస్టాల్జియా AI టూల్

Deep Nostalgia: పాత ఫొటోలకు ప్రాణం... ఆశ్చర్యపరుస్తున్న డీప్ నోస్టాల్జియా AI టూల్

పాత ఫొటోలకు ప్రాణం... ఆశ్చర్యపరుస్తున్న డీప్ నోస్టాల్జియా AI టూల్ (image credit - twitter)

Deep Nostalgia: పాత ఫొటోలు కదులుతాయి... కన్ను కొడతాయి... దిక్కులు చూస్తాయి... నవ్వుతాయి... వెక్కిరిస్తాయి... ఇదంతా డీప్ నోస్టాల్జియా AI టూల్ మహిమ. ఎలాగో తెలుసుకుందాం.

  • Share this:
    Deep Nostalgia: టెక్నాలజీ మరింతగా అందుబాటులోకి వస్తోంది. కదలిక లేని పాత ఫొటోలు కూడా వీడియోల లాగా కదలడం ఆశ్చర్యకరమే. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ (AI)ని ఉపయోగించి... పాత ఫొటోలకు ప్రాణం పోస్తున్నారు. ఈ టూల్ పేరు డీప్ నోస్టాల్జియా. దీనికి మీరు పాత ఫొటో ఏదైనా ఇస్తే... దాన్లో వ్యక్తి కదులుతున్నట్లుగా, నవ్వుతున్నట్లుగా, వెక్కిరిస్తున్నట్లుగా ఇలా రకరకాలుగా మార్చేయగలదు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్, భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్, మోనాలిసా ఇలా ఎంతో మంది ఫొటోలు ఇప్పుడు సజీవంగా కదులుతున్నాయి. వాటిలో వ్యక్తి నిజంగానే కదులుతున్నాడా అనిపిస్తున్నాయి. కొన్ని ఫొటోల్లో వ్యక్తులు కదులుతుంటే... మనకు ఒకింత భయం కలగడం సహజం.

    మై హెరిటేజ్ (MyHeritage) సంస్థ... డీప్ నోస్టాల్జియా టూల్‌ని తయారుచేసింది. ఈ టూల్ పాత ఫొటోలకు యానిమేషన్ కల్పిస్తోంది. చిన్న పాటి వీడియో పోర్ట్రయిట్‌లను తయారుచేస్తోంది. డీప్ నోస్టాల్జియా టూల్... తనకు ఇచ్చిన ఫొటోను బాగా స్టడీ చేస్తుంది. ఆ తర్వాత ఆ ఫొటోకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వాలో ఇస్తుంది. ఆ తర్వాత అందులో వ్యక్తి కదులుతారు.




    ఇందుకోసం టూల్‌లో ముందుగానే రకరకాల కదలికలు, ముఖ హావభావాలను పొందుపరిచారు. కానీ ఇచ్చిన ఫొటో నుంచి వీడియో తయారవ్వడం... అది నిజమైన వీడియోలాగే ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.



    ఈ నోస్టాల్జియా టూల్ వల్ల చరిత్రలో వీడియోలు లేని ప్రముఖుల వీడియోలు ఉంటే... వాళ్లు వాటిలో ఇలాగే ఉండేవారేమో అని అనిపించడం సహజం. ప్రస్తుతం చాలా మంది యూజర్లు ఈ టూల్ వాడుకుంటున్నారు. తమ పూర్వీకుల ఫొటోలను వీడియోలుగా మార్చుకుంటున్నారు.


    చాలా మంది పెయింటింగ్స్‌పైనా ఈ ప్రయోగం చేస్తున్నారు.


    కొంత మంది మీమ్స్‌పై ప్రయోగం చేసి... ఎంతవరకూ పనిచేస్తుందో చూస్తున్నారు.








    ఇలా ప్రయోగాలు చేసిన వారు... ఆ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో... ఒక్కసారిగా ఈ పోర్ట్రయిట్‌లు ట్విట్టర్‌లో పెరిగిపోయాయి.





    ఇది కూడా చదవండి: Photos: ఇండొనేసియాలో బద్ధలైన అగ్నిపర్వతం... ఆకాశమంతా బూడిద... ఫొటోలు చూడండి

    ఈ టూల్ ప్రస్తుతం MyHeritage.com సైట్‌లో లభిస్తోంది. యూజర్లు తమ పూర్వీకుల పాత ఫొటోలను డైరెక్టుగా అప్‌లోడ్ చేయవచ్చు. లేదా డ్రాగ్ అండ్ డ్రాప్ విధానంలోనూ వెయ్యవచ్చు. ఫొటో నుంచి వచ్చే వీడియోను సేవ్ చేసుకోవాలటే మాత్రం మీరు సైనింగ్ అప్ (Signing up) అవ్వాలి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు