ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్... తాజాగా రూట్ మార్చాడు. అతనిప్పుడు మార్ఫ్డ్ ఫేస్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ల లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. డైలాగులు ఇరగదీస్తున్నాడు. ఇటీవలే బాహుబలి డైలాగ్ చెప్పిన వార్నర్.. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ కమెడీయన్ మిస్టర్ బీన్ పాత్రల్లో కనిపించి ఔరా అనిపించారు.
హైదరాబాద్ లోనే గాక.. వార్నర్ కు భారత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. బుట్టబొమ్మ వీడియోతో పాటు.. లాక్డౌన్ టైం లో పలు భారతీయ సినిమాల పాటలకు అతడు చేసిన నృత్యం హైలైట్ గా నిలిచింది.
ఇక తాజాగా వార్నర్.. ఎఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమా ట్రైలర్ లో కనిపించాడు. రజినీకాంత్ ప్లేస్ లో తన ఫేస్ ను మార్ఫ్ చేశాడు.
View this post on Instagram
రజినీతో పాటు తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా ట్రైలర్ లో డైలాగులు కూడా అభిమానులను అలరించాయి.
View this post on Instagram
ఇక మిస్టర్ బీన్ అవతారంలో అయితే డేవిడ్ వార్నర్ ఇరగదీశాడు.
View this post on Instagram
ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలను చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ అభిమానులైతే వార్నర్ నటనా కౌశల్యానికి మెచ్చుకోలేక ఉండలేకపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Darbar, David Warner, Instagram, Maharshi, Social Media