Video: కత్రినా కైఫ్ ఐటమ్ సాంగ్... కూతురితో కలిసి వార్నర్ స్టెప్పులు

లాక్ డౌన్ సమయంలో డేవిడ్ వార్నర్ ఫుల్లుగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. వాటిని పలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు.

news18-telugu
Updated: April 18, 2020, 9:24 PM IST
Video: కత్రినా కైఫ్ ఐటమ్ సాంగ్... కూతురితో కలిసి వార్నర్ స్టెప్పులు
కూతురితో కలసి డ్యాన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్
  • Share this:
ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు భారత్ అంటే ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కూతురికి కూడా ‘ఇండి’ అని పేరుపెట్టుకున్నాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఆస్ట్రేలియాలో కూడా లాక్ డౌన్ నెలకొనడంతో వార్నర్ ఈ సమయాన్ని ఫుల్లుగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. వాటిని పలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు. ఇటీవలే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టిక్ టాక్‌లో చేరిన డేవిడ్ వార్నర్.. తన ఫాలోయర్లను పెంచుకోవడానికి కాలికి పనిచెప్పాడు. అందుకోసం కత్రినా కైఫ్ బ్లాక్ బస్టర్ ఐటమ్ సాంగ్ బాగా పనికొచ్చింది. తీస్ మార్ ఖాన్ సినిమాలోని ‘షీలా కీ జవానీ’ సాంగ్ కుర్రకారును ఊపేసింది. ఇప్పుడు ఆ సాంగ్ వార్నర్‌ను కూడా ఊపేసింది. కత్రినా కైఫ్ డ్యాన్స్ స్టెప్పులకు ఫిదా అయిన డేవిడ్ వార్నర్ తన కుమార్తె ఇండితో కలసి ఆ పాటకు అచ్చుగుద్దినట్టు స్టెప్పులు వేశాడు. దాన్ని టిక్ టాక్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే సుమారు 2,50,000 వీడియో వ్యూస్ వచ్చాయి.










View this post on Instagram





Indi has asked to also do one for you guys! 😂😂 please help me someone!!!!!! #statue


A post shared by David Warner (@davidwarner31) on




Published by: Ashok Kumar Bonepalli
First published: April 18, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading