David Warner: లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఫ్యాన్స్‌ని మరింత ఎంటర్టైన్ చేస్తున్నారు. లాక్డౌన్ వేళ కుటుంబ సభ్యులతో ఉన్న డేవిడ్ వార్నర్ టిక్‌టాక్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా రచ్చనే చేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోని పాటలకు స్టెప్పులు వేసి, తన నోటి వెంట డైలాగ్‌లను చెప్పి అభిమానులను ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా బుట్ట బొమ్మ, మైండ్ బ్లాక్, రాములో రాములా వంటి పాటలకు స్టెప్పులు వేసి తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. అలాగే మహేష్ పోకిరి, ప్రభాస్ బాహుబలి మూవీ డైలాగ్‌లకు కూడా టిక్‌టాక్ చేశారు. ఇలా క్రీడాభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా డేవిడ్ ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయినప్పుడు డేవిడ్ అభిమానులు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇకపై డేవిడ్ వీడియోలను మిస్ అవుతామని చాలా మంది కామెంట్లు పెట్టారు. అయితే టెక్నాలజీ వాడకంలో ముందు వరుసలో ఉన్న డేవిడ్.. ఇన్‌స్టా రీల్స్‌తో మళ్లీ అభిమానుల ముందుకు వచ్చారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్న డేవిడ్.. ఇప్పుడు మళ్లీ తన వీడియోలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాహుబలిలో ప్రభాస్ వీడియోను తన ఫొటోతో మార్ఫింగ్ చేసి రచ్చ చేశారు వార్నర్.
View this post on Instagram
ఇక తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ని టార్గెట్ చేశారు. హృతిక్ నటించిన పలు సినిమాలోని సీన్లలో అతడి స్థానంలో తన ఫొటోతో మార్ఫింగ్ చేశారు వార్నర్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ సమయంలోనూ పలుమార్లు బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, Hrithik Roshan