పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ తల్లి కోసం ఓ కూతురు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన తీరు చాలామందిని ఆకట్టుకుంటోంది. కర్ణాటకకు చెందిన ఓ నిర్భయ కూతురు ఈ సాహసం చేసింది. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులోని కీయూర్ ప్రాంతానికి చెందిన మమతా రాయ్ అనే నాగుపాము కాటుకు గురైంది. ఆ తర్వాత తన తల్లి ప్రాణాలను కాపాడేందుకు కూతురు శ్రమ్యా రాయ్ స్వయంగా ఆమె కాలులోని విషాన్ని పీల్చుకుంది. శ్రమ్య కాలేజీ విద్యార్థిని, ఆమె తల్లి గ్రామ పంచాయతీ మెంబర్. ఆ అమ్మాయి కథను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తన ట్విట్టర్ పేజీలో పంచుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మమత తన తల్లి పొలం వైపు వెళ్లింది. పొలం నుంచి తిరిగి వస్తుండగా నాగుపాము కాటుకు గురైంది. ప్రమాదవశాత్తు పాముపై మమతరాయ్ కాలు వేసింది. అప్పుడు నాగుపాము ఆమెను కాలిపై కాటు వేసింది. అతని పాము కాటుకు గురైందని గుర్తించిన మమత, ఆ విషం శరీరంలోని ఇతర భాగాల్లోకి రాకుండా పొడి గడ్డిని కాలుకు కట్టంది.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మమత పాము కాటుకు గురైందని చెప్పింది. కూతురికి విషయం తెలిసిన వెంటనే తల్లి పాదాల నుంచి విషాన్ని పీల్చింది. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించారు. సమయానికి తల్లి శరీరం నుంచి విషాన్ని బయటకు తీయడంతో మమత ప్రాణాలు నిలిచాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మమతను కాటు వేసిన నాగుపాము మలబార్ పిట్ వైపర్.
Viral Video: రోగికి సర్జరీ చేస్తుండగా భూకంపంతో కరెంట్ పోయింది..డాక్టర్లు ఏం చేశారో ఈ వీడియో చూడండి
Viral news : లాటరీలో రూ.3కోట్లు..భర్తకు హ్యాండిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకున్న మహిళ
మమత ఒకరోజు ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత డిశ్చార్జ్ అయింది. శ్రమ్య తన కాలేజీలో గైడ్ రేంజర్. స్కౌట్ కూడా. ఒక వ్యక్తి శరీరం నుండి పాము విషాన్ని పీల్చే టెక్నిక్ గురించి తాను విన్నానని, సినిమాల్లో కూడా చూశానని ఆమె తెలిపింది. నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచ స్థాయిలో 78,600 పాముకాటు మరణాలలో, 64,100 మరణాలు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending