Daughter marries stepfather : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం అన్న విషయం తెలిసిందే. జీవితాంతం తనను అర్థం చేసుకొని కష్టసుఖాల్లో తోడునీడుగా ఉండే భాగస్వామి దొరకాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం జనాలు పెళ్లి అర్థాన్ని మార్చేస్తున్నారు. మామూలుగా అయితే జీవితంలో ఒక మంచి తోడు కోసం పెళ్లి చేసుకోవడం చేస్తూ ఉంటారు.ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా ఒక పెళ్లితో ఆగడం లేదు. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక కొద్ది రోజులుగా కూతురిని తండ్రి పెళ్లి చేసుకోవడం,తండ్రిని కూతురు పెళ్లి చేసుకోవడం వంటి విచిత్ర ఘటనలు కూడా చూస్తున్నాం తాజాగా మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన సవతి తండ్రినే(Step father)వివాహం చేసుకుంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లల్ని కూడా కనింది.
అమెరికాలోని లాస్ వెగాస్‌లో నివసించే క్రిస్టీ అనే యువతి తన సవతి తండ్రిని పెళ్లాడింది. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. క్రిస్టీ వివాహం చేసుకున్న వ్యక్తి ఆమె తల్లి మాజీ భర్త. అంటే సవతి తండ్రి. అతడిని చూడగానే ప్రేమలో పడింది. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా బంధం ఏర్పరచుకున్నారు. ఇటీవల క్రిస్టీ...సవతి తండ్రితో వివాహం తన జీవితంలో అతి పెద్ద నిర్ణయమని, తాను అదృష్టవంతురాలిని అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. మహిళ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆ తర్వాత ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తన వివాహం తర్వాత వేడుక ఫొటోలను షేర్ చేయడంతో పాటు #MarryYourMomsEx అనే వీడియోను కూడా క్రిస్టీ షేర్ చేసింది. తన తల్లిని మోసం చేయడం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్ణయంగా భావించి భర్తగా మారిన తన తండ్రితో చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. మరోవైపు,తన తల్లితో కూడా తనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయని,ఆమెతో మాట్లాడుతూనే ఉన్నట్లు క్రిస్టీ తెలిపింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పోయే కాలం దాపురించింది అని కొందరు కామెంట్ చేస్తుండగా..విదేశాల్లో ఇలాంటి కామనే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: USA